Gmail Tips and Tricks: మీ జీమెయిల్ నిండిపోయిందా ? ఈ ట్రిక్‌తో, స్టోరేజ్ క్లియర్ అవుతుంది ?

Gmail Tips and Tricks: జీ మెయిల్, ఫోటోలు, డ్రైవ్, ఇతర సర్వీసుల్లో డేటాను సేవ్ చేయడానికి వినియోగదారులకు 15జీబీ ఫ్రీ స్టోరేజ్ స్పేస్ ఇవ్వబడుతుంది. మీరు కొన్ని సులభమైన మార్గాల్లో మీ జీమెయిల్ స్టోరేజ్ స్పేస్ ఖాళీ చేసుకోవచ్చు.

Update: 2024-11-24 03:30 GMT

Gmail Tips and Tricks

Gmail Tips and Tricks: ఇమెయిల్‌లను పంపడాని, స్వీకరించడానికి కోట్ల మంది వ్యక్తులు ప్రస్తుతం జీమెయిల్ ను ఉపయోగిస్తున్నారు. కానీ కొన్నిసార్లు జీ మెయిల్ స్టోరేజ్ నిండిపోయిన సమస్యను తరచూ ప్రజలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది జీ మెయిల్ వాడుతున్న ప్రతి రెండవ వ్యక్తి ఎదుర్కొంటున్న సమస్య. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతున్నారు. డబ్బు ఖర్చు చేయకుండా జీ మెయిల్ లో ఖాళీ ప్లేస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వార్త కథనంలో తెలుసుకుందాం.

జీ మెయిల్ స్టోరేజ్ పరిమితి మాట్లాడాలంటే. జీ మెయిల్, ఫోటోలు, డ్రైవ్, ఇతర సర్వీసుల్లో డేటాను సేవ్ చేయడానికి వినియోగదారులకు 15జీబీ ఫ్రీ స్టోరేజ్ స్పేస్ ఇవ్వబడుతుంది. మీరు కొన్ని సులభమైన మార్గాల్లో మీ జీమెయిల్ స్టోరేజ్ స్పేస్ ఖాళీ చేసుకోవచ్చు.

జీమెయిల్ స్టోరేజీని ఎలా క్లీన్ చేయాలి

* పాత వార్తాలేఖలు, ప్రచారాలు లేదా పాత చాట్లు వంటి మీకు ఇకపై అవసరం లేని ఇమెయిల్‌లను తొలగించండి.

* పెద్ద అటాచ్ మెంట్స్ ఎక్కువ స్పెస్ ను తీసుకుంటాయి, మీరు సెర్చింగ్ పేజీలో "has:attachment larger:10M" అని టైప్ చేయడం ద్వారా 10MB కంటే పెద్ద జోడింపులను కనుగొనవచ్చు.. వాటిని తొలగించవచ్చు.

* జీమెయిల్ స్టోరేజీ నిండిపోయే అవకాశాలను తొలగించడానికి స్పామ్, ట్రాష్ ఫోల్డర్‌లను క్రమం తప్పకుండా ఖాళీ చేస్తూ ఉండండి.

* చాలాసార్లు మనకు తెలియని కొందరు పంపిన ఇమెయిల్‌లను స్వీకరిస్తాం. ఇమెయిల్‌ను తెరిచి, ఇమెయిల్‌లో కనిపించే అన్‌సబ్‌స్క్రైబ్ ఎంపికపై క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు ఆ పంపినవారి నుండి తదుపరిసారి ఇమెయిల్‌ను అందుకోలేరు.

* గూగుల్ డిస్క్, ఫోటోలలో ఈ విషయాలను కనుగొనండి

* పెద్ద ఫైల్‌లను తొలగించండి లేదా వాటిని గూగుల్ డిస్క్, ఫోటోలలో తక్కువ స్థలాన్ని తీసుకునే ఫార్మాట్‌కి మార్చండి.

* ఇది కాకుండా, కొన్నిసార్లు కొన్ని ఫైల్‌లు, ఫోటోలు డూప్లికేట్ ఫైల్‌లుగా మారతాయి. ఇవి స్టోరేజీను తగ్గించడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితిలో అలాంటి ఫోటోలను కనుగొని తొలగించండి.

* ఏదైనా ఇమెయిల్‌ను తొలగించే ముందు, మీరు 100 సార్లు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఇమెయిల్‌ను ఒకసారి తొలగించినట్లయితే, మెయిల్‌ను తిరిగి పొందడం కష్టం. ఈ పద్ధతులను ప్రయత్నించడం ద్వారా మీరు జీమెయిల్ స్టోరేజీని సులభంగా ఖాళీ చేయవచ్చు.

Tags:    

Similar News