Smart Phones: స్మార్ట్ ఫోన్‌ ఎందుకు పేలుతోంది..! కారణాలు తెలుసుకోండి..

*బ్యాటరీ వేడెక్కడం వల్ల కూడా ఫోన్‌ పేలిపోతుంది. *సాంకేతికంగా చెప్పాలంటే ఇది 'థర్మల్ రన్‌అవే' కారణంగా జరుగుతుంది.

Update: 2021-11-18 07:44 GMT

స్మార్ట్ ఫోన్‌ (ఫైల్ ఫోటో)

Why Do Smart Phones Explode: ఇటీవల కాలంలో తరచూ స్మార్ట్‌ఫోన్లు పేలిపోయిన సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి ఘటనల వల్ల అమాయకులైన వినియోగదారులు మృతి చెందుతున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్లు పేలడానికి కారణాలేంటి ఇవి ఎందుకు పేలిపోతున్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఫోన్ పేలిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఫోన్‌ కిందపడిపోవడం. దీనివల్ల బ్యాటరీలో లీకేజీ ఏర్పడవచ్చు. దీనివల్ల ఛార్జింగ్ పెట్టే సమయంలో పేలిపోవచ్చు. .

ఇది కాకుండా మరో కారణం బ్యాటరీ చాలా సందర్భాల్లో బ్యాటరీలు పేలిపోయి మంటలు వ్యాపిస్తాయి. బ్యాటరీలో అనేక రకాల లేయర్లు ఉంటాయి. కొన్నిసార్లు ఫోన్ కిందపడినప్పడు ఈ లేయర్లలో గ్యాప్ ఏర్పడుతుంది. అప్పుడు బ్యాటరీ అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ అవుతుంది.

ఇది కాకుండా బ్యాటరీ వేడెక్కడం వల్ల కూడా ఫోన్‌ పేలిపోతుంది. సాంకేతికంగా చెప్పాలంటే ఇది 'థర్మల్ రన్‌అవే' కారణంగా జరుగుతుంది. బ్యాటరీలో తాపన చక్రం కొనసాగుతుంది అధిక ఉష్ణోగ్రత కారణంగా ఒక భాగం వేడిగా మారుతుంది. బ్యాటరీలో సమస్య కారణంగా ఇది జరుగుతుంది.

చాలా సార్లు చవకైన లేదా లోకల్ ఫోన్‌లు ఈ సమస్యను తట్టుకోలేవు అందుకే ఒక భాగం వేడెక్కి ఫోన్‌ పేలిపోతుంది. ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్టడం వల్ల కూడా బ్యాటరీ వేడెక్కుతుంది. బ్యాటరీ, ఫోన్ రెండూ వేడెక్కుతాయి. ఇది షార్ట్ సర్క్యూట్ లేదా పేలుడుకు దారితీస్తుంది. అందుకే ఈ రోజుల్లో చాలా కంపెనీలు కొత్త ఫీచర్‌ని అందిస్తున్నాయి.

బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత కరెంట్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. దీని ద్వారా ఈ సమస్యని నివారించవచ్చు. స్మార్ట్‌ఫోన్ పేలుడుని నివారించాలనుకుంటే మొదట ఫోన్ బ్యాటరీపై శ్రద్ధ వహించాలి. ఫోన్ బ్యాటరీ ఉబ్బడం లేదా శబ్దం ఉంటే అప్పుడు ఆ బ్యాటరీ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందని అర్థం చేసుకోండి. ఈ పరిస్థితిలో ఫోన్‌ను మీ నుంచి దూరంగా ఉంచండి. ఇది కాకుండా ఫోన్‌ను ఎక్కువసేపు ఛార్జింగ్‌లో ఉంచవద్దు.

Tags:    

Similar News