Vivo Y300 Series: మస్త్ ఉంది బాసూ.. 6,500mAh బ్యాటరీతో Y300 సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లు..!

Vivo Y300 Series: వివో Y300 సిరీస్‌లో Y300 5G,Y300 Pro 5G స్మార్ట్‌ఫోన్లను త్వరలో లాంచ్ చేయనుంది. వీటిలో 6,500mAh బ్యాటరీ ఉంటుంది.

Update: 2024-08-14 14:07 GMT

Vivo Y300 Series

Vivo Y300 Series: ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో Y300 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను త్వరలో విడుదల చేయనుంది. నివేదికల ప్రకారం Vivo ప్రస్తుతం చైనా మార్కెట్ కోసం రెండు మోడళ్లను తయారు చేస్తోంది. వాటిలో Vivo Y300 5G, Vivo Y300 Pro 5G ఉన్నాయి. చైనా లోని 3C సర్టిఫికేషన్‌‌లో ప్రో వేరియంట్‌ రిజిస్టర్ అయింది. ఇది మోడల్ నంబర్ V2410Aతో వస్తుంది. వీటిలో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అంతే కాకుండా దీని సంబంధించిన కొంత సమాచారం కూడా ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Vivo Y300 Pro 5G చైనా 3C సర్టిఫికేషన్‌లో కనిపించింది. దీని మోడల్ నంబర్ V2410A. అంటే ఇది 5G స్మార్ట్‌ఫోన్. దీనిలో పవర్ కోసం 6,500mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 80W ఛార్జర్‌తో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇతర ఫీచర్ల గురించి ఎటువంటి సమాచారం అందుబాటులోకి రాలేదు. కానీ టిప్‌స్టర్ పాండా ఈజ్ బాల్డ్ Vivo Y300 Pro 5G భారీ 6,500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుందని పేర్కొన్నారు.

Vivo Y300 ప్రో చైనాలో ఈ నెల చివరిలో లేదా సెప్టెంబర్ 2024లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇతర వార్తల గురించి మాట్లాడితే Vivo ఇటీవల భారతదేశంలో Vivo V40 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ Vivo కెమెరా పవర్‌హౌస్, ఇది Zeiss కెమెరా, అనేక ఇతర ఫీచర్లతో వస్తుంది.

కంపెనీ Vivo V40 Pro 8GB + 256GB వేరియంట్ కోసం రూ. 49,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. అయితే 12GB + 512GB వేరియంట్ ధర రూ. 55,999. ఈ ఫోన్ ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా అందుబాటులో ఉంది. Vivo ఆఫ్‌లైన్ కొనుగోలుదారులకు 6 నెలల ఉచిత యాక్సిడెంటల్ లిక్విడ్ డ్యామేజ్‌తో పాటు ఫ్లాట్ 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఇది కాకుండా 12 నెలల పాటు జీరో డౌన్ పేమెంట్, Vivo V-షీల్డ్‌పై 40 శాతం వరకు తగ్గింపుతో పాటు 10 శాతం వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా ఉంది.

Tags:    

Similar News