Vivo T3 Ultra: లాంచ్‌కు రెడీ.. సూపర్ ఫీచర్లతో వివో నుంచి కొత్త ఫోన్.. చెక్ చేయండి..!
Vivo T3 Ultra: వివో తర్వలో టీ3 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ముఖ్యమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.
Vivo T3 Ultra: టెక్ మేకర్ వివో తన మొబైల్ లవర్స్‌కు అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. కంపెనీ వివో T3 సిరీస్‌లో Vivo T3 Ultraను తీసుకురానుంది. కంపెనీ దీని లాంచ్‌ను అఫిషియల్‌గా కన్ఫామ్ చేసింది. ఇప్పటికే కొన్ని ముఖ్యమైన ఫీచర్లు లీక్ అయ్యాయి. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Vivo T3 Ultra ఫోన్ ఈ నెలలో భారతీయ మార్కెట్‌లోకి రానుంది. దీని మైక్రోసైట్ కంపెనీ వెబ్‌సైట్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతుంది. Vivo T3, Vivo T3x, Vivo T3 Lite తర్వాత T3 సిరీస్‌లో ఇది నాల్గవ ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimension 9200 SoC చిప్‌సెట్‌తో పని చేస్తుంది. దీని కెమెరా సెటప్ OIS ఫీచర్‌తో వస్తుంది.
Vivo T3 Ultra Offers
సమాచారం ప్రకారం ఇది మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 8GB + 128GB ధర రూ. 30,999. ఉంటుంది 8GB + 256GB ధర రూ. 32,999, 12GB + 256GB ధర రూ. 34,999. ఈ ఫోన్ ఫ్రాస్ట్ గ్రీన్, లూనా గ్రే కలర్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ కొనుగోలుపై 3,000. వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది.
Vivo T3 Ultra Features
Vivo T3 అల్ట్రా మొబైల్ 6.78-అంగుళాల 3D కర్వ్డ్ 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. ఇది 4500 nits పీక్ బ్రైట్నెస్, 2800 x 1260 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, P3 సినిమా గ్రేడ్ కలర్ గామట్, HDR 10+ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. కంపెనీ Vivo T3 అల్ట్రా ఫోన్‌లో MediaTek Dimension 9200+ SoC ప్రాసెసర్ అందిస్తుంది.
ఈ 4nm చిప్‌సెట్‌లో 17 బిలియన్ ట్రాన్సిస్టర్‌లు, అధునాతన APU ఫ్యూజన్ టెక్నాలజీ ఉంది. ఇది అసమానమైన శక్తిని, సామర్థ్యాన్ని అందిస్తుంది. అలానే ఈ మొబైల్ చిప్ AnTuTu ప్లాట్‌ఫామ్‌లో 16,09,257 పాయింట్లకు పైగా స్కోర్ చేసింది. మొబైల్ 12GB RAM+ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది 12GB వరకు వర్చువల్ ర్యామ్ టెక్నాలజీని కూడా అందిస్తుంది. దీని సహాయంతో మీరు మొత్తం శక్తిని 24GB వరకు పొందవచ్చు.
Vivo T3 Ultra Camera
Vivo T3 అల్ట్రాలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది OIS, f/1.88 ఎపర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ IMX 921 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది. ఈ సెటప్‌కు సమీపంలో స్మార్ట్ ఆరా లైట్ అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం f/2.0 ఎపర్చరు, ఆటోఫోకస్, AI ఫేస్ కలర్ టెక్నాలజీతో కూడిన 50మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
కంపెనీ Vivo T3 అల్ట్రా మొబైల్‌లో 5500mAh బ్యాటరీని అందిస్తుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ ఇస్తుంది. దీంతో మీరు లాంగ్ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ పొందవచ్చు. ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. ఫోన్‌లో డ్యూయల్ స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటాయి.