Vivo New Mobiles: పక్కా హిట్.. వివో నుంచి రెండు పాపులర్ ఫోన్లు.. హీటెక్కిస్తున్న కెమెరా టెక్నాలజీ..!

Vivo New Mobiles: వివో తన ఎక్స్ సిరీస్‌లో X100, X100 Pro ఫోన్లను లాంచ్ చేయనుంది. అక్టోబర్ 14న ఇవి లాంచ్ కానున్నాయి.

Update: 2024-09-13 12:14 GMT

vivo x200 series

Vivo New Mobiles: స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో తన పాపులర్ సిరీస్ ఎక్స్ సిరీస్‌లో కొత్త ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అందులో Vivo X200, Vivo X200 Pro ఉన్నాయి. ఇవి ప్రస్తుతం అందుబాటులో ఉన్న Vivo X100 సిరీస్‌కి అప్‌గ్రేడ్ చేసిన మోడళ్లుగా చైనాలో త్వరలో లాంచ్ కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లపై ఇప్పటికే అనేక లీక్స్ బయటకు వచ్చాయి. వీటి ప్రకారం ఈ రెండు ఫోన్లు అక్టోబర్‌లో సేల్‌కి వచ్చే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Vivo Xగత సంవత్సరం Vivo X100, Vivo X100 Pro ఫోన్లను నవంబర్ మొదటి వారంలో విడుదల చేసింది. అయితే ఇప్పుడు 200 సిరీస్ ఫోన్లను అక్టోబర్ 14న లాంచ్ చేయనుంది. Vivo X200 సిరీస్ లాంచ్ ఈవెంట్ చైనాలోని బీజింగ్‌లో జరగనుంది. ప్రస్తుతానికి, Vivo X200 సిరీస్ గురించి ఎటువంటి వివరాలను ధృవీకరించలేదు. Vivo X200 సిరీస్ ఫోన్లు MediaTek డైమెన్సిటీ 9400 SoC ప్రాసెసర్‌పై రానున్నాయి.

X200 సిరీస్‌లో 1.5K 8T LTPO ఐసో-డెప్త్ మైక్రో క్వాడ్-కర్వ్డ్ OLED డిస్‌ప్లే అల్ట్రా-సన్నని బెజెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ వంటి ఫీచర్లు ఉంటాయి. ఫోటోగ్రఫీ కోసం Vivo ఫోన్ 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 200MP పెరిస్కోప్-టెలిఫోటో కెమెరాను అందించారు.

ఇది దాని ముందున్న X100 ప్రోలో 50MP టెలిఫోటో కెమెరాను రీప్లేస్ చేస్తుంది. X200 సిరీస్‌లోని కెమెరాలు ZEISSతో కలిసి డెవలప్ చేశారు. వివో X200 ప్రో 5,400mAh బ్యాటరీతో లేదా పెద్ద 6,000mAh బ్యాటరీని ప్యాక్‌‌తో వస్తుందని లీక్స్ సూచిస్తున్నాయి. X200 Pro డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 లేదా IP69 రేటింగ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Vivo X200లో పెరిస్కోప్ కెమెరాలను డౌన్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా Vivo X200 చిన్న బ్యాటరీని కూడా ప్యాక్ చేయగలదు. నివేదికల ప్రకారం వెనిలా X200 మరింత కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌ను కలిగి ఉంటుంది. ఇది 6.3-అంగుళాల 8T LTPO OLED డిస్‌ప్లేతో రావచ్చు. Vivo X200 సిరీస్ గురించి మరింత సమాచారం త్వరలో అందుబాటులోకి రానుంది.

Tags:    

Similar News