Vivo Y37 Pro Launched: వివో విశ్వరూపం.. సైలెంట్‌గా బడ్జెట్ ఫోన్ లాంచ్..!
Vivo Y37 Pro Launched: Vivo బడ్జెట్ సెగ్మెంట్‌లో Y37 Pro స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. దీన్ని రూ.21,000లతో కొనుగోలు చేయవచ్చు.
Vivo Y37 Pro Launched: స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో నిశ్శబ్దంగా కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. Vivo Y37 Pro స్మార్ట్‌ఫోన్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కంపెనీ ఇప్పటికే Vivo Y300 Pro స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ మరో బడ్జెట్ మొబైల్ Vivo Y37 ప్రోని చైనా మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ క్రమంలో కొత్త ఫోన్ ధర, ఫీచర్ల తదితర వివరాలు తెలుసుకుందాం.
Vivo Y37 Pro మొబైల్ 6.68 అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. 8GB RAM, IP64 రేటింగ్‌తో కూడిన 6000mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపొర్ట్‌తో పాటు అనేక ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది.
Vivo Y37 Pro Price
కంపెనీ వివో Y 37 ప్రో మొబైల్‌ను సింగిల్ స్టోరేజ్ ఆప్షన్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ధర రూ.21,000. (CNY 1,799) ఉంది. ఈ మొబైల్ మూడు కలర్స్‌లో చైనాలో విడుదలైంది. పింక్, గ్రీన్, బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
Vivo Y37 Pro Features
Vivo Y37 Pro మొబైల్ 6.68 అంగుళాల HD + LCD డిస్ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. ఇది వినియోగదారులకు సరసమైన బడ్జెట్‌లో లభించే ఫోన్. ఈ కొత్త Vivo ఫోన్‌లో Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ ఉంది. ఈ చిప్‌సెట్ క్లాక్ స్పీడ్ 2.2 GHz. దీని కారణంగా మీరు గేమింగ్, ఇతర టాస్క్‌లలో సున్నితమైన అనుభవాన్ని పొందవచ్చు.
ఈ మొబైల్ 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. Vivo Y37 Pro మొబైల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, LED ఫ్లాష్‌తో వస్తుంది. ఇది వెనుక ప్యానెల్‌పై 50 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, పోర్ట్రెయిట్ మోడ్ కోసం 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. దీనితో పాటు సెల్ఫీలు కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
ఈ ఫోన్ 6,000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఒక ఛార్జ్‌పై రెండు రోజుల వరకు బ్యాకప్‌ను అందిస్తుంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. వాటర్,డస్ట్ రెసిస్టెన్స్ కోసం మొబైల్‌కు IP64 రేటింగ్ ఉంది.