Vivo Y36c Launched: బడ్జెట్ ఫోన్ లాంచ్.. వర్షంలోనూ వాడొచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు..!

Vivo Y36c Launched: వివో Y36c బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఇది IP54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది.

Update: 2024-08-30 07:16 GMT

Vivo Y36c Launched

Vivo Y36c Launched: ప్రముఖ బ్రాండ్ Vivo తన కస్టమర్ల కోసం కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇది అనేక గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ పేరు Vivo Y36c. ఈ ఫోన్ మూడు అద్భుతమైన కలర్ వేరియంట్‌లలో విడుదలైంది. అందులో మూన్ షాడో బ్లాక్, డిస్టెంట్ మౌంటైన్ గ్రీన్, డైమండ్ పర్పుల్ కలర్స్ ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.10,629 మాత్రమే. కాబట్టి రూ. 10,000 బడ్జెట్‌లో లేటెస్ట్ ఫీచర్లు కొరుకొనే వారికి చాలా బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ఈ ఫోన్ ఫీచర్లు, డిజైన్, కెమెరా, కాన్ఫిగరేషన్‌ల ధరలను ఇప్పుడు చూద్దాం.

Vivo Y36c Features
ఎంట్రీ-లెవల్ ఫోన్ కావడంతో ఇది సెల్ఫీ కెమెరా కోసం ముందు భాగంలో వాటర్ డ్రాప్ నాచ్, సైడ్ బెజెల్స్ కంటే మందంగా ఉంటుంది. అయితే ఫోన్ ఫ్లాట్ మిడిల్ ఫ్రేమ్‌తో లేటెస్ట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో పెద్ద రెక్టాంగిల్ కెమెరా ఐస్‌లాండ్ ఉంటుంది. ఫోన్ 8.53 mm మందం, బరువు 185 గ్రాములు మాత్రమే.

కెమెరాల గురించి మాట్లాడితే ఫోన్ వెనుకవైపు 50 MP మెయిన్ సెన్సార్ (0.64μm సింగిల్ పిక్సెల్ పరిమాణం, f/1.8)ని కలిగి ఉంది. ఇది ముందు భాగంలో 5 MP సెల్ఫీ సెన్సార్‌తో లింకై ఉంటుంది. ముందు భాగంలో ఫోన్ 6.56 అంగుళాల 90Hz LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 840 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇది తక్కువ బ్లూ లైట్ ఐ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్‌తో కూడా వస్తుంది.

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో అమర్చబడింది. ఇది TSMC 6nm ప్రాసెస్‌పై రన్ అవుతుంది. 2+6 కోర్ ఆర్కిటెక్చర్‌, 2×2.4GHz కార్టెక్స్-A76 కోర్ + 6×2.0GHz కార్టెక్స్ A55 కోర్, GPU ఆర్మ్ మాలి G57 MC2. ఈ చిప్‌సెట్ గీక్‌బెంచ్ సింగిల్, మల్టీ కోర్ టెస్టుల్లో వరుసగా 800, 2000 స్కోర్‌లను సాధించింది. పవర్ చేయడానికి, ఫోన్ 5000 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది IP54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. అంటే ఈ పోన్‌ను చిన్నపాటి వర్షంలోనూ ఉపయోగించవచ్చు.

Vivo Y36c Price
ఈ ఫోన్ నాలుగు స్టోరేజ్, మెమరీ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. వీటిలో 6GB+128GB ధర రూ. 10,629, 8GB+128GB ధర రూ. 11,811, 8GB+256GB ధర రూ. 12,994 , 12GB+256GB ధర రూ. 15,358 స్టోరేజ్ ఆప్షన్‌లు ఉన్నాయి. బ్రాండ్ ప్రస్తుతం ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను చైనీస్ మార్కెట్‌లో విడుదల చేసింది. అందువల్ల, ఈ ఫోన్ ప్రస్తుతం కంపెనీ చైనీస్ వెబ్‌సైట్‌లో సేల్‌కి అందుబాటులో ఉంది.

Tags:    

Similar News