Vivo T3 Pro 5G launched In India: బొమ్మ బ్లాక్ బస్టర్.. బడ్జెట్ 5G ఫోన్ లాంచ్.. భారీ ఆఫర్లతో బుక్ చేయండి..!

Vivo T3 Pro 5G launched In India: వివో T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. రూ. 3000 డిస్కౌంట్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

Update: 2024-08-27 13:15 GMT

Vivo T3 Pro 5G launched In India

Vivo T3 Pro 5G launched In India: చైనీస్ టెక్ కంపెనీ Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo T3 Pro 5Gని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. Vivo T3 5G సిరీస్‌లో Vivo T3 Lite 5G, Vivo T3x 5G ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పుడు వివో T3 Pro 5G కూడా ఇందులో చేరింది. స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫినిషింగ్ డిజైన్, కర్వ్డ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్‌‌తో వస్తుంది. 8GB RAM, OIS సపోర్ట్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అలానే ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 4500mAh కెపాసిటీ గల బ్యాటరీఉంది. దీని ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Vivo T3 Pro 5G Price
భారతీయ మార్కెట్లో Vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ధర రూ.24,999గా ఉంది. ఇది కాకుండా మరో 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 26,999 ధరతో విడుదల చేశారు. ఈ ఫోన్ సెప్టెంబర్ 3 మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేయవచ్చు, వివో ఇండియా వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కూడా సేల్‌కు రానుంది.

Vivo T3 Pro 5G Offers
ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ల విషయానికి వస్తే బ్యాంక్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ.3000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు రూ.21,999కి దక్కించుకోవచ్చు. ఇది ఎమరాల్డ్ గ్రీన్, శాండ్‌స్టోర్ ఆరెంజ్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో శాండ్‌స్టోన్ ఆరెంజ్ వేరియంట్ వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో వస్తుంది.

Vivo T3 Pro 5G Specifications
Vivo స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4500నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో 6.77 అంగుళాల ఫుల్ HD+ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్, 8GB LPDDR4X RAM ఉంది. ఇది కాకుండా 256GB వరకు UFS 2.2 స్టోరేజ్ అందుబాటులో ఉంది. Android 14 ఆధారంగా FuntouchOS 14 సాఫ్ట్‌వేర్‌పై రన్ అవుతుంది.

కెమెరా గురించి మాట్లాడితే వెనుక ప్యానెల్‌లో 50MP సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్ ఉంది. 16MP సెల్ఫీ కెమెరాతో కూడిన ఈ ఫోన్ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh కెపాసిటీతో పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. Vivo T3 Pro 5G IP64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.

Tags:    

Similar News