Vivo Y300 Pro: వివో నుంచి పాపులర్ ఫోన్లు.. ఈసారి దుమ్ములేపుద్ది..!

Vivo Y300 Pro: Vivo రాబోయే పాపులర్ సిరీస్ Y300కి సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఇందులో Y300, Y300 Pro మోడల్‌ల ఉంటాయి.

Update: 2024-08-18 14:56 GMT

Vivo Y300 Pro

Vivo Y300 Pro: Vivo రాబోయే పాపులర్ సిరీస్ Y300కి సంబంధించి పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ సిరీస్ త్వరలో చైనాలో విడుదల కావచ్చు. ఇందులో Vivo Y300, Vivo Y300 Pro మోడళ్లు ఉంటాయి. ఈ సిరీస్‌లోని Vivo Y300 Pro స్మార్ట్‌ఫోన్  చైనాలో 3C సర్టిఫికేషన్‌ను కూడా దక్కించుకుంది. అయితే ఈ ఫోన్ గురించి మరో షాకింగ్ న్యూస్ రివీల్ అయింది. దీని ప్యాకేజింగ్ బాక్స్ లాంచ్‌కు ముందే లీక్ అయింది. దీని ద్వారా ఫోన్‌లో పెద్ద బ్యాటరీ ఉంటుందని తెలుస్తుంది.

అయితే Vivo Y300 Pro ప్యాకేజింగ్ బాక్స్ ఫోటోలు ఫోన్ లాంచ్‌కు ముందే బయటకు లీక్ అయ్యాయి. ఈ బాక్స్‌పై ఉన్నట్లుగా బ్యాటరీ కెపాసిటీ 6500mAhగా ఉంది. అంటే ఊహించినట్లుగా కంపెనీ ఈ ఫోన్‌లో చాలా భారీ బ్యాటరీని ఉపయోగించబోతోంది. ఈ ఫీచర్‌ను చాలా మంది చైనీస్ టిప్‌స్టర్లు ముందే వెల్లడించారు. ప్యాకేజింగ్ బాక్స్ ఇప్పుడు దీనిని ధృవీకరించింది.

6500mAh బ్యాటరీ ఫోన్‌కు పెద్ద ఆకర్షణగా నిలుస్తుంది. దాని వేరియంట్‌లలో ఒకటి పర్పుల్ కలర్‌తో రావచ్చు. ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుందని 3C సర్టిఫికేషన్ వెల్లడించింది. ఇతర స్పెసిఫికేషన్ల గురించి ఎటువంటి సమాచారం అందుబాటులోకి రాలేదు. కానీ దీని ముందు మోడల్ Vivo Y200 Pro స్పెసిఫికేషన్‌లను చూడటం ద్వారా రాబోయే కొత్త సిరీస్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండవచ్చనే దాని గురించి అంచనా వేయచ్చు.

Vivo Y200 Pro 6.78 అంగుళాల FullHD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్‌సెట్‌ని కలిగి ఉంది. ఫోన్‌లో పవర్ కోసం 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ కొత్త మోడల్‌లోని బ్యాటరీ పెద్ద అప్‌గ్రేడ్‌తో 6500mAh ఉంటుంది. ఫోన్ 64MP మెయిన్ కెమెరాతో వచ్చింది. దీనిలో 2 మెగాపిక్సెల్‌ సెకండరీ లెన్స్ కూడా ఉన్నాయి. ఫోన్ స్లిమ్ బిల్డ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని మందం 7.5 మిమీ మాత్రమే. బరువు 172 గ్రాములు మాత్రమే. ఇప్పుడు Vivo Y300 ప్రోలో బ్యాటరీ కాకుండా ఇతర అప్‌గ్రేడ్‌లు ఏముంటాయో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News