Aadhaar: ఇస్రోతో జతకట్టిన యూఐడీఏఐ.. సమాచారం మరింత సులువు..!
Aadhaar: ఆధార్ వినియోగదారులు ఈ విషయాన్ని కచ్చింగా తెలుసుకోవాలి. ఆధార్ కార్డ్ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పత్రం.
Aadhaar: ఆధార్ వినియోగదారులు ఈ విషయాన్ని కచ్చింగా తెలుసుకోవాలి. ఆధార్ కార్డ్ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పత్రం. ఇది లేకుండా ప్రభుత్వ పనులు కానీ ప్రభుత్వేతర పనులు కానీ చేయలేము. వినియోగదారుల కోసం ఆధార్ కార్డును జారీ చేసే సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఎప్పటికప్పుడు అనేక సౌకర్యాలను అందిస్తోంది. ఇప్పుడు కొత్తగా ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ (ISRO)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఆధార్ వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది.
ISROతో UIDAI ఒప్పందం
ఆధార్ కార్డ్ జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) లొకేషన్‌ను ట్రాక్ చేయడానికి ISROతో ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత మీరు మీ ఇంటికి సమీపంలో ఉన్న ఆధార్ కేంద్రాన్ని గుర్తించవచ్చు. మీరు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా మీ ఇంటి వద్ద కూర్చుని సమీపంలోని ఆధార్ కేంద్రం గురించి సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.
ఆధార్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ సమాచారాన్ని అందించింది. NRSC, ISRO, UIDAI సంయుక్తంగా భువన్ ఆధార్ పోర్టల్‌ను ప్రారంభించాయి. ఈ పోర్టల్‌లోని ద్వారా ఆధార్ కేంద్రానికి సంబంధించిన ఆన్‌లైన్ సమాచారాన్ని పొందవచ్చు. ఇది కాకుండా మీ సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని చేరుకోవడానికి మార్గం చూపిస్తుంది. ఇందులో మీకు దూరం గురించి సమాచారం కూడా తెలియజేస్తుంది.
లొకేషన్ ఇలా తెలుసుకోండి..?
1. దీని కోసం ముందుగా https://bhuvan.nrsc.gov.in/aadhaar/కి వెళ్లండి.
2. తర్వాత మీ సమీప ఆధార్ కేంద్రం గురించిన సమాచారాన్ని పొందడానికి సెంటర్ నియర్‌బై ఎంపికపై క్లిక్ చేయండి.
3. ఇక్కడ ఆధార్ సెంటర్ స్థానాన్ని పొందుతారు.
4. ఇది కాకుండా మీరు ఆధార్ సేవా కేంద్రం ద్వారా సెర్చ్ చేయవచ్చు.
5. మీరు ఆధార్ కేంద్రం పేరును నమోదు చేస్తే సమాచారాన్ని పొందుతారు.
6. మీకు కావాలంటే పిన్ కోడ్ ద్వారా సెర్చ్ చేస్తే మీ చుట్టూ ఉన్న ఆధార్ కేంద్రం గురించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
5. చివరి ఎంపిక రాష్ట్ర వారీగా ఆధార్ సేవా కేంద్రం ఈ ఎంపికను ఎంచుకోవడం ద్వారా మీరు రాష్ట్రంలోని అన్ని ఆధార్ కేంద్రాల గురించి సమాచారాన్ని పొందవచ్చు.