Smartphone: నిద్రలేవగానే ఫోన్‌ చూస్తే ఏమవుతుందో తెలుసా..?

Smartphone: ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ కనిపిస్తోంది. ఒక నిమిషం చేతిలో ఫోన్‌ లేకపోతే కొంపలు మునిగిపోయినట్లు భావిస్తున్నారు.

Update: 2024-09-15 01:30 GMT

Smartphone: నిద్రలేవగానే ఫోన్‌ చూస్తే ఏమవుతుందో తెలుసా..?

Smartphone: ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ కనిపిస్తోంది. ఒక నిమిషం చేతిలో ఫోన్‌ లేకపోతే కొంపలు మునిగిపోయినట్లు భావిస్తున్నారు. మనలో దాదాపు ప్రతీ ఒక్కరూ ఉదయం లేచిన వెంటనే చేసే పని స్మార్ట్‌ఫోన్‌ను చూడడం. దాదాపు ప్రతీ ఒక్కరూ తమ రోజును ఇలాగే ప్రారంభిస్తుంటారు. అయితే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోన్‌ చూడడం ఏమాత్రం మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే స్మార్ట్‌ఫోన్‌ ద్వారా మానసికంగా దుష్ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇంతకీ లేచిన వెంటనే ఫోన్‌ చూస్తే కలిగే ఆ నస్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం లేవగానే ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు, వాట్సాప్‌లో స్టేటస్‌లు చూసే వారి మానసిక స్థితిపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో చూసే అంశాలు మానసిక ఒత్తిడికి కారణమవుతుందని అంటున్నారు. మనకు నచ్చని అంశాలు, మనపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అంశాలు చూస్తే కలిగే ఒత్తిడి రోజంతా మనపై ప్రభావం చూపుతుంది. ఇక లేచిన వెంటనే ఫోన్‌ స్క్రీన్‌ నుంచి వచ్చే లైట్‌ కళ్లపై పడితే దుష్ప్రభావానికి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు.

ఇక ఫ్రెష్‌గా మొదలు పెట్టాల్సిన రోజు సోషల్‌ మీడియా చూడడం వల్ల గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. మీరు చేయాలనుకున్న పనులకు ఈ కారణంగా బ్రేక్‌ పడే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఉదయం లేచిన వెంటనే ఫోన్‌ని చూడకూడదని చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే రాత్రి పడుకునే ముందే ఫోన్‌ను బెడ్‌కు దూరంగా పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.

ఉదయాన్ని అలారం పెట్టుకునే వారు అందుకోసం ఫోన్‌ను ఉపయోగించడం మానేయాలి. దీనికి బదులుగా చిన్న వాచ్‌లను ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఉదయాన్నే ఫోన్‌ను చూసే అలవాటు తగ్గుతుంది. అలాగే లేచిన వెంటనే ఏదో ఒక పనిలో బిజీగా మారడానికి ప్రయత్నించాలి. యోగా, వాకింగ్‌, గోరువెచ్చని నీరు తాగడం ఇలా ఏదో ఒక అలవాటు చేసుకుంటే ఫోన్‌ చూడడం నుంచి బయటపడొచ్చు.

Tags:    

Similar News