Recharge Plans: రూ. 200లోపు బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ఏంటి.? ఎందులో ఎలాంటి బెనిఫిట్స్‌..!

Recharge plan: రూ. 200లోపు బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ఏంటి.? ఎందులో ఎలాంటి బెనిఫిట్స్‌..

Update: 2024-07-22 10:34 GMT

Recharge Plans: రూ. 200లోపు బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ఏంటి.? ఎందులో ఎలాంటి బెనిఫిట్స్‌..!

Recharge Plans: ప్రస్తుతం దేశంలో టెలికాం సంస్థల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో కంపెనీలు భారీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా రిఛార్జ్‌ ప్లాన్స్‌ ఛార్జీలు పెంచిన తర్వాత రకరకాల ప్లాన్స్‌ను ప్రవేశపెడుతూ యూజర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. వీటిలో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ముందు వరుసలో ఉందని చెప్పాలి. మరి ఈ క్రమంలో రూ. 200లోపు ప్లాన్స్‌తో ఏయే టెలికాం సంస్థలు ఎలాంటి బెనిఫిట్స్‌ అందుస్తున్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.

వొడాఫోన్‌ ఐడియా..

వొడాఫోన్‌ ఐడియాలో రూ. 200లోపు అందుబాటులో మొత్తం నాలుగు ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొదటిది రూ. 155 ప్లాన్‌. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 20 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 1 జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. ఇక రూ. 200 లోపు అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ప్లాన్‌ రూ. 179. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 1 జీబీ డేటా పొందొచ్చు. అన్‌లిమిడెట్ కాల్స్‌ పొందొచ్చు. ఇక మరో బెస్ట్ రీఛార్జ్‌ ప్లాన్‌ రూ. 189. దీంతో రీఛార్జ్‌ చేసుకుంటే 1 జీబీ డేటా లభిస్తుంది. అలాగే 26 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. రూ. 199తో రీఛార్జ్‌ చేసుకుంటే 1 జీబీ డేటా అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.

జియో..

జియో విషయానికొస్తే ఇందులో రూ. 199 ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటాను పొందొచ్చు. 18 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందొచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ వంటి సబ్‌స్క్రిప్షన్స్‌ను ఉచితంగా పొందొచ్చు.

బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్స్‌..

ఇక బీఎస్‌ఎన్‌ విషయానికొస్తే ఇందులో రూ. 107తో రీఛార్జ్‌ చేసుకుంటే 35 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 3 జీబీ డేటాను పొందొచ్చు. ఒకవేళ రూ. 108తో రీఛార్జ్‌ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్‌ చేసుకుంటే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. రోజుకు 1 జీబీ డేటా పొందొచ్చు. రోజుకు 500 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందొచ్చు. అలాగే రూ. 147 ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో 10 జీబీ డేటా అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు.

Tags:    

Similar News