Apple: ఆపిల్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. సెప్టెంబర్ 9 తర్వాత ఈ ఐఫోన్ మోడల్స్ కొనలేరు..!

Apple: ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను సెప్టెంబర్ 9 న విడుదల చేయబోతోంది. ఈ క్రమంలో ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మాక్స్‌‌ను నిలిపివేయనుంది.

Update: 2024-09-03 12:31 GMT

Apple

Apple: ఆపిల్ తన ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను సెప్టెంబర్ 9 న విడుదల చేయబోతోంది. ఈ సిరీస్ ఫోన్ల గురించి మొబైల్ లవర్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కొత్త ఫోన్‌లు మార్కెట్‌లోకి వస్తుండటంతో ఆపిల్ ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మాక్స్‌లను నిలిపివేయవచ్చని చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. ఆపిల్ AirPodలు, Apple వాచ్ కూడా సెప్టెంబర్ 9 ఈవెంట్ తర్వాత ఆగిపోవచ్చు. 2018 నుండి కొత్త ఐఫోన్ సిరీస్‌ను ప్రారంభించడంతో కంపెనీ దాని ముందు జనరేషన్ ఫ్లాగ్‌షిప్ గ్యాడ్జెట్లను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

ఐఫోన్ 16 సిరీస్‌తో కంపెనీ అదే ధోరణిని కొనసాగించవచ్చు. గత సంవత్సరం రిలీజ్ అయిన ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్‌లను నిలిపివేయవచ్చు. శుభవార్త ఏమిటంటే ఐఫోన్ సిరీస్ స్టాండర్ట్ వేరియంట్ అంటే iPhone 15 అందుబాటులో ఉంటుంది. iPhone 15 Pro, Pro Maxతో పాటు, కంపెనీ 2021 సంవత్సరానికి చెందిన iPhone 14, iPhone 13లను కూడా నిలిపివేయవచ్చు. iPhone 13 సిరీస్‌లోని స్టాండర్డ్ iPhone 13 ఇప్పటికీ సేల్‌కి అందుబాటులో ఉంది.

ఆపిల్ వాచ్ గురించి మాట్లాడితే కంపెనీ ఆపిల్ వాచ్, ఆపిల్ వాచ్ అల్ట్రాలను కొత్త మోడళ్లతో రీప్లేస్ చేయగలదు. కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ 10లో మీరు పెద్ద డిస్‌ప్లే, స్లిమ్ డిజైన్‌తో కొత్త చిప్‌ని చూడవచ్చు. ఇది పవర్ ఫుల్ ప్రాసెసర్‌తో వస్తుందని ఆపిల్ వాచ్ అల్ట్రా 3 గురించి కంపెనీ తెలిపింది. కంపెనీ వాచ్ SE3 ను కూడా లాంచ్ చేయబోతోందని భావిస్తున్నారు. ఇది ప్లాస్టిక్ బాడీతో ఓల్డ్ జనరేషన్ ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ రాకతో కంపెనీ గత సంవత్సరం వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 10లను నిలిపివేసే అవకాశం ఉంది.

ఆపిల్ రెండు కొత్త AirPods 4 మోడళ్లను విడుదల చేయబోతోంది. కొత్త లాంచ్‌ను పరిశీలిస్తే కంపెనీ ఫస్ట్, సెకండ్ జనరేషన్ ఎయిర్‌పాడ్‌లను కూడా నిలిపివేయవచ్చని టాక్ వినిపిస్తుంది. సెప్టెంబర్ 9న జరిగే ఈవెంట్‌లో ఆపిల్ కొత్త ఐప్యాడ్ మోడల్‌లను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీ ఐప్యాడ్ మినీ 6వ తరం, ఐప్యాడ్ 10వ జనరేషన్ కూడా నిలిపివేయవచ్చు.

Tags:    

Similar News