Telegram New Feature: ప్రముఖ సోషల్ మెసేజింగ్ అప్లికేషన్ టెలిగ్రామ్ యూజర్లకు శుభవార్త. ఇకపై ఒకేసారి 1000 మంది వరకు గ్రూప్ వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశాన్ని టెలిగ్రామ్ యూజర్లకు వినియోగదారులకు కల్పించింది. అంతేకాకుండా వీడియో షేరింగ్ ఫీచర్‌ని కూడా అప్డేట్ చేసింది. వాట్స్ అప్ కి పోటీగా సోషల్ మెసేజింగ్ అప్ లో పోటీ పడుతున్న టెలిగ్రామ్ దానికి దీటుగానే రకరకాల ఫీచర్ల అప్డేట్ లతో వినియోగదారుల ముందుకు వస్తుంది. ఇక వీడియో షేరింగ్ ఫీచర్ ద్వారా మన ఇన్ బాక్స్‌లోని రికార్డింగ్ బటన్‌ని క్లిక్ చేస్తే వీడియో రికార్డ్ అవడంతో పాటు ఆ రికార్డయిన వీడియోలను మన స‍్నేహితులకు, బంధువులకు కూడా షేర్ చేసుకోనే సదుపాయాన్ని కల్పించింది.
ప్రస్తుతం కొత్త ఫీచర్ వలన 1000 మంది ఒకేసారి లైవ్ మీటింగ్ లేదా ఆన్లైన్ క్లాసులు వంటి వాటికోసం ఉపయోగిచుకోవచ్చు. గ్రూప్ కాల్ ని ప్రారంభించడానికి మొదటగా గ్రూప్ అడ్మిన్ ఒక వాయిస్ చాట్ ని క్రియేట్ చేసి ఆ తర్వాత వీడియోని ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ వీడియో మెసేజ్ రికార్డు చేయడానికి వన్ ఆన్ వన్ కలపడంతో స్క్రీన్ షేరింగ్ ని కూడా చేసుకోవచ్చు. ఇక వీడియో చాట్ జరుగుతున్న సమయంలో ప్రతిది సరిగ్గా ఉందో లేదో తెలుసుకోడానికి ప్రివ్యూ ఆప్షన్ ని కూడా టెలిగ్రామ్ అందుబాటులో ఉంచింది.