వాట్సాప్ కి షాక్.. టెలిగ్రామ్ యాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
Telegram News Features: ఇందులో భాగంగా వాయిస్ ఛాట్ సపోర్ట్‌ను యాడ్ చేసింది
Telegram News Features: వాట్సాప్ షాకిస్తున్నారు వినియోగదారులు. కొత్త ప్రైవసీ పాలసీనే దీనికి ప్రధాన కారణం. ఇదే సమయంలో సిగ్నల్, టెలిగ్రామ్ డౌన్లోడ్స్ పెరిగాయి. టెలిగ్రామ్ కొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులను మరింత మందిని చేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వాయిస్ ఛాట్ సపోర్ట్‌ను యాడ్ చేసింది. ఈ వాయిస్ సపోర్ట్ క్లబ్‌హౌస్ యాప్‌లోని వాయిస్ చాట్ మాదిరిగానే పనిచేస్తుంది.
ఇక, టెలిగ్రామ్ తన ఛానెల్స్‌లో వాయిస్ చాట్ సపోర్ట్‌ను యాడ్ చేసింది. వాయిస్ చాట్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపర్చడం కోసం ఈ ఫీచర్ణు అందుబాటులోకి తెచ్చింది. వాయిస్ చాట్‌లతో యూజర్లు తమ స్నేహితులతో సులభంగా ఇంటరాక్ట్ కావొచ్చు. ఆయా గ్రూప్స్‌లో ఛానెల్ నిర్వాహకులు అవసరాన్ని బట్టి నిర్దిష్ట తేదీ, సమయంలో వాయిస్ చాట్‌ను షెడ్యూల్ చేయవచ్చు.
అంతేకాక, ఈ వాయిస్ చాట్‌లకు మరిన్ని అదనపు ఫీచర్లను జోడించడానికి కొత్త అప్డేట్ను ప్రకటించింది. క్రొత్త అప్డేట్ ప్రకారం అన్ని టెలిగ్రామ్ చాట్‌ల కోసం పేమెంట్ ఫీచర్‌ను యాడ్ చేసింది. అంతేకాక, వాయిస్ చాట్‌ల కోసం షెడ్యూలింగ్, మినీ ప్రొఫైల్‌లను అందుబాటులోకి తెచ్చింది. క్రొత్త అప్డేట్ ప్రకారం ఏదైనా చాట్‌లోని మెసేజెస్ను, ఇన్వైట్ లింక్స్‌ను టైమర్ సెట్ చేసుకొని ఆటో-డిలీట్ చేసుకోవచ్చు. తద్వారా, వేగంగా చాట్ చేసుకునే అవకాశం కలుగుతుంది.
* ఆటోమేటిక్‌గా మీ వాయిస్ మెసేజ్ గ్రూప్ సభ్యులందరికీ పంపించబడుతుంది.
*ఈ వాయిస్ చాట్‌ను షెడ్యూల్ చేసుకోవడం కోసం అడ్మిన్లు ఛానల్ ఐకాన్‌పైన అలాటే త్రీడాట్ సెట్టింగ్స్‌పైన ట్యాప్ చేయాలి
*'స్టార్ వాయిస్ చాట్' ఆప్షన్లు సెలక్ట్ చేసుకొని తర్వాత 'షెడ్యూల్ వాయిస్ చాట్' ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి.
* వాయిస్ చాట్ షెడ్యూల్ చేసుకోవడం కోసం కింద ఉన్న బటన్‌పై ట్యాప్ చేయాలి.
* నోటిఫికేషన్ ఛానల్ పైభాగంలో కనిపిస్తుంది.
*కొత్తగా వచ్చిన ఈ షెడ్యూలింగ్ ఫీచర్ హ్యాండీ ఎడిషన్‌గా ఉంటుంది.
*టెలిగ్రామ్ రెండు కొత్త వెబ్ యాప్‌లను కూడా జతచేస్తున్నట్లు తెలిపింది.
* యానిమేటెడ్ స్టిక్కర్లు, డార్క్ మోడ్, చాట్ ఫోల్డర్లు వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.