Tecno Spark Go 1 First Sale: టెక్నో నుంచి కొత్త బడ్జెట్ ఫోన్.. ఆపిల్ డిజైన్‌.. రూ.7,299కే బుక్ చేయండి..!

Tecno Spark Go 1 First Sale: Tecno కొత్త బడ్జెట్ ఫోన్‌ Spark Go 1 మొదటి సేల్ ప్టెంబర్ 3న ప్రారంభం కానుంది. దీన్ని ఆఫర్లపై రూ.7,299కి కొనుగోలు చేయవచ్చు.

Update: 2024-09-02 14:15 GMT

Tecno Spark Go 1 First Sale

Tecno Spark Go 1 First Sale: Tecno ఇటీవల భారతదేశంలో తన కొత్త బడ్జెట్ ఫోన్‌గా Spark Go 1ని విడుదల చేసింది. ఈ ఫోన్ మొదటిసారిగా సెప్టెంబర్ 3న సేల్‌కు తీసుకురానున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 8000 కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 120Hz స్క్రీన్, 8GB RAM కలిగి ఉంటుంది. ఫోన్ డ్యూయల్ స్పీకర్ సెటప్‌ని కలిగి ఉంది. ఫోన్ 4 సంవత్సరాల పాటు లాగ్-ఫ్రీ అనుభవాన్ని అందిస్తుంది. ఫోన్‌ను ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టెక్నో అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Tecno Spark Go 1 Offers
టెక్నో స్పార్క్ గో వన్ సెప్టెంబర్ 3 మధ్యాహ్నం 12 గంటల నుండి Amazon,Flipkart,Tecno వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఫోన్ ధర రూ.7,299 నుంచి ప్రారంభమవుతుంది. టెక్నో ఫోన్ లైమ్ గ్రీన్, గ్లిట్టరీ వైట్, స్టార్‌ట్రైల్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఫోన్‌పై ఖచ్చితంగా కొంత బ్యాంక్ డిస్కౌంట్ ఉంటుంది. ఇది సేల్ ప్రారంభమైన వెంటనే వెల్లడవుతుంది. ఇది సెప్టెంబర్ 6 నుండి ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలోకి రానుంది.

Tecno Spark Go 1 Features
ఈ స్మార్ట్‌ఫోన్ Android 14 Go ఎడిషన్‌పై రన్ అవుతుంది. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల HD+ స్క్రీన్ (720x1,600 పిక్సెల్‌లు) కలిగి ఉంది. డిస్‌ప్లేలో సెల్ఫీ షూటర్ కోసం హోల్ పంచ్ కటౌట్ ఉంది. ఫోన్ 8GB RAM, 128GB వేరియంట్‌లలో వస్తుంది. దీనిలో Unisoc T615 చిప్‌సెట్‌ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌, డ్యూయల్ ఫ్లాష్‌తో కూడిన 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్ కోసం డ్యూయల్ ఫ్లాష్‌తో ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

ఇది AI లెన్స్‌తో పనిచేస్తుంది. DTS సౌండ్‌తో డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉంది. ఇది IP54-రేటెడ్ సపోర్ట్‌తో వస్తుంది. అలానే IR కంట్రలో కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. టైప్-సి పోర్ట్ ద్వారా ఫోన్‌ను ఛార్జ్ చేయవచ్చు. ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుంది.

Tags:    

Similar News