Cheapest Tablet: ప్రపంచంలోనే అత్యంత చౌకైన టాబ్లెట్ వస్తోంది.. ధర ఎంతంటే..?
Cheapest Tablet: ప్రపంచంలోనే అత్యంత చౌకైన టాబ్లెట్ వస్తోంది.. ధర ఎంతంటే..?
Cheapest Tablet: నేటి యుగంలో స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఏ పని చేయాలన్నా వీటితో సులువుగా జరుగుతుంది. అలాగే వీటి ధర కూడా ఎక్కువగా ఉండటం వల్ల సామాన్యులకి అందడం లేదు. అయితే చైనా కంపెనీ Teclast సరసమైన టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లకు ప్రసిద్ధి చెందింది. ఈ కంపెనీ ఇప్పుడు తన ఎంట్రీ-లెవల్ టాబ్లెట్‌ను చైనాలో ప్రారంభించింది. ఇది శక్తివంతమైన ఫీచర్‌లతో వస్తోంది. దీని పేరుని అధికారికంగా Teclast P26T అని పిలుస్తున్నారు. మార్కెట్‌లో ఉన్న చాలా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే ఇది చౌకగా ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Teclast P26T టాబ్లెట్ స్పెక్స్
Teclast P26T అనేది 10.1-అంగుళాల డిస్‌ప్లేతో కూడిన బడ్జెట్ టాబ్లెట్. LCD ప్యానెల్ 1280 x 800 పిక్సెల్‌లుCheapest Tablet: ప్రపంచంలోనే అత్యంత చౌకైన టాబ్లెట్ వస్తోంది.. ధర ఎంతంటే..?. ఇది 4GB RAMతో జత చేసిన, Allwinner A523 SoC ద్వారా శక్తిని పొందుతుంది. చిప్ 1.8GHz ARM కోర్టెక్స్-A55 కోర్ క్లాక్ స్పీడ్‌తో ఆక్టా-కోర్ CPU ద్వారా శక్తిని పొందుతుంది. డ్యూయల్-బ్యాండ్ వై ఫై, బ్లూటూత్ 5.2తో వస్తుంది. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 5MP ప్రైమరీ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్ ఉంటాయి.
Teclast P26T టాబ్లెట్ ధర
ఈ టాబ్లెట్ Android 13తో పాటు 4GB వరకు వర్చువల్ ర్యామ్‌కు సపోర్ట్ ఇస్తుంది. చివరగా ఇది 5,000mAh బ్యాటరీ నుంచి శక్తిని తీసుకుంటుంది. ధర గురించి చెప్పాలంటే చైనాలో దీని ధర ¥499 ( అంటే సుమారు 5 వేల రూపాయలు). ఇది బహుశా ప్రపంచంలోనే అత్యంత చౌకైన టాబ్లెట్‌గా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.