సోషల్‌ మీడియాలో ఎక్కువసేపు గడుపుతున్నారా.. మరిచిపోయి కూడా ఈ పొరపాటు చేయకండి..!

Cyber Fraud: భారతదేశంలో డిజిటలైజేషన్ వేగంగా జరుగుతోంది. డిజిటల్ ఇండియా వంటి పథకం ద్వారా దేశంలోని ప్రతి మూలను కనెక్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Update: 2022-05-14 10:00 GMT

సోషల్‌ మీడియాలో ఎక్కువసేపు గడుపుతున్నారా.. మరిచిపోయి కూడా ఈ పొరపాటు చేయకండి..!

Cyber Fraud: భారతదేశంలో డిజిటలైజేషన్ వేగంగా జరుగుతోంది. డిజిటల్ ఇండియా వంటి పథకం ద్వారా దేశంలోని ప్రతి మూలను కనెక్ట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే అంతే వేగంగా సైబర్‌ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఇదే టెక్నాలజీని ఉపయోగించుకొని సైబర్ నేరస్థులు ప్రజలని మోసం చేస్తున్నారు. వ్యక్తిగత వివరాలను సంపాదించి ఖాతాలో ఉన్న డబ్బులని మొత్తం మాయం చేస్తున్నారు. సైబర్ నేరాలకు పాల్పడే నేరస్థులు బ్యాంకు అధికారులు, కస్టమర్ కేర్, మొదలైన వ్యక్తులమని చెబుతూ ఫోన్‌ చేస్తారు. తర్వాత వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతాడు. బ్యాంక్ ఖాతా నంబర్, రేషన్ కార్డ్ సమాచారం, ఆధార్ నంబర్ వంటి అవసరమైన సమాచారాన్ని పొందుతారు. తర్వాత ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం దోచేస్తాడు.

సోషల్ మీడియాలో వచ్చే లింక్‌లని క్లిక్ చేయవద్దు. పాన్ కార్డ్ నంబర్ (పాన్ కార్డ్) వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరితో షేర్ చేయవద్దు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ట్విట్టర్ హ్యాండిల్ అయిన సైబర్ దోస్త్ హెచ్చరించింది. ఆధార్ కార్డ్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్, అడ్రస్ ప్రూఫ్ మొదలైన ముఖ్యమైన సమాచారాన్ని తెలియని వ్యక్తితో షేర్‌ చేసుకోవద్దు. ఎందుకంటే వారు మీకు తెలియకుండా ఈ పత్రాలను ఉపయోగించి డూప్లికేట్ సిమ్‌ని తయారు చేసుకోవచ్చు. దీని ద్వారా మీ అకౌంట్‌లో ఉన్న డబ్బు మొత్తం దోచేస్తారు. అనేక చట్టవిరుద్ధమైన పనులు చేస్తారు.

మర్చిపోయి కూడా మీ వ్యక్తిగత వివరాలను ఎవ్వరితో షేర్‌ చేసుకోకండి. తెలియని వ్యక్తులతో బ్యాంక్ వివరాలను కూడా షేర్‌ చేసుకోవద్దు. సోషల్‌ మీడియాలో వచ్చే లింకులపై ఆలోచించకుండా క్లిక్ చేయవద్దు. మీరు ఏదైనా మోసానికి గురైనట్లయితే వెంటనే మీ బ్యాంక్, సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచండి.


Tags:    

Similar News