Sony Xperia Ace 2: సోనీ ఎక్స్‌పీరియా ఏస్ 2 విడుదల.. ధర రూ.15 వేలలోపే..!

Sony Xperia Ace 2: సోనీ ఎక్స్‌పీరియా ఏస్ 2 అనే కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది.

Update: 2021-05-20 08:37 GMT

సోనీ ఎక్స్‌పీరియా ఏస్ 2 (ఫొటో ట్విట్టర్)

Sony Xperia Ace 2: సోనీ ఎక్స్‌పీరియా ఏస్ 2 అనే కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ఇది ప్రస్తుతం జపాన్‌లో మాత్రమే లభించనుంది. రెండేళ్ల క్రితం ఎక్స్‌పీరియా ఏస్ స్మార్ట్ ఫోన్‌ ను విడుదల చేసింది సోనీ. మళ్లీ ఇన్నాళ్లకు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయోచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ధర: సోనీ ఎక్స్‌పీరియా ఏస్ 2 లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ మాత్రమే మార్కెట్‌లోకి వచ్చింది. దీని ధర 22,000 జపాన్ యెన్‌లుగా(సుమారు రూ.14,800) ఉంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, వైట్ కలర్లో దొరుకుంతుంది.

స్పెసిఫికేషన్లు: ఈ ఫోన్‌లో 5.5 ఇంచుల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌ తో వచ్చిన ఈ ఫోన్ లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ మెమొరీని అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డుతో స్టోరేజీని మరింత పెంచుకోవచ్చు. సోనీ ఎక్స్‌పీరియా ఏస్ 2 లో బ్యాక్‌ సైడ్ 13 మెగాపిక్సెల్ తోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అందించారు. మందుభాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ ఉంది.

ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. 4500 ఎంఏహెచ్‌గా ఉంది. ఐపీఎక్స్8 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వచ్చిన ఈ ఫోన్.. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. అయితే ఈ ఫోన్‌ 4జీ టెక్నాలజీ లోతో విడుదలవ్వడం ఒకింత నిరాశగానే చెప్పుకోవాలి. వైఫై, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, బ్లూటూత్ వీ5.0, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ లాంటి మరిన్నిఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

Tags:    

Similar News