Mini AC: వార్నీ.. చూసేందుకు మినీ ఏసీ భయ్యా.. స్విచ్ఛ్ ఆన్ చేస్తే.. చలికి వణికిపోవాల్సిందే.. రూ.2వేలలోపే..!

Shades & Brothers Mini Air Conditioner: మార్కెట్లో చాలా పోర్టబుల్ ఎయిర్ కూల్లర్లు అందుబాటులోకి వచ్చాయి.

Update: 2024-04-12 07:30 GMT

Mini AC: వార్నీ.. చూసేందుకు మినీ ఏసీ భయ్యా.. స్విచ్ఛ్ ఆన్ చేస్తే.. చలికి వణికిపోవాల్సిందే.. రూ.2వేలలోపే..!

Shades & Brothers Mini Air Conditioner: మార్కెట్లో చాలా పోర్టబుల్ ఎయిర్ కూల్లర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి మన చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతను తగ్గించడానికి తేమను ఉపయోగించుకుంటాయి. వేడిగాలులను తగ్గించి, ఇంటి వాతావరణాన్ని కూల్‌గా చేయడంలో సహాయపడతాయి. ఇది చూసేందుకు చిన్నగా ఉన్నా.. చల్లగా చేయడంలో బాగా పనిచేస్తుంది. పెద్ద ఏసీలు, కూలర్లు కొనే స్తోమతలేనప్పుడు వీటిని ఇంటికి తెచ్చుకుంటే.. ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ క్రమంలో పోర్టబుల్ కూలర్ లేదా AC మీకు లాభదాయకమైన ఒప్పందం కావచ్చు. మార్కెట్‌లో అనేక పోర్టబుల్ ACలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మీ గదిని పూర్తిగా చల్లబరుస్తాయి.

ఈ క్రమంలో వచ్చిందే షేడ్స్ & బ్రదర్స్ కంపెనీ తీసుకొచ్చిన మినీ కూలర్. ఈ బ్రాండ్ నుంచి మార్కెట్‌లోకి వచ్చిన మినీ ఎయిర్ కండీషనర్ వేడిని తట్టుకునేందుకు సహాయపడుతుంది. ఇది అచ్చం ఏసీలా పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మినీ ఎయిర్ కూలర్: ఇది ఒక మినీ ఎయిర్ కూలర్ అని తెలుసుకోవడం ముఖ్యం. ఇది చుట్టుపక్కల గాలిని చల్లబరుస్తుంది. అయితే, ఏసీలా మొత్తం గదిని చల్లగా చేయలేకపోవచ్చు.

వాటర్ ట్యాంక్ & ఫిల్టర్లు: ఈ మినీ ఎయిర్ కండీషనర్‌లో వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఈ ట్యాంక్‌ని నీటితో నింపి, ఫిల్టర్‌లను తడిపించాలి. ఇవి గాలిని చల్లబరచడానికి సహాయపడతాయి.

పరిమాణం & విద్యుత్తు వినియోగం: ఇది చిన్నదిగా ఉంటుంది. కాబట్టి చిన్న స్థలాలకు, వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే అనుకూలం. రన్నింగ్ కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే విద్యుత్తు వినియోగం తక్కువ.

ఆన్‌లైన్‌లో కొనొచ్చు: ప్రస్తుతం, ఈ Shades & Brothers మినీ ఎయిర్ కండీషనర్ ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యతలో ఉంది. ఫ్లిప్ కార్ట్‌లో దీని అసలు ధర రూ.4999లుగా ఉంది. కానీ, 61 శాతం ఆఫర్‌తో కేవలం రూ.1949లకే కొనుగోలు చేయవచ్చు.

షేడ్స్ & బ్రదర్స్ మినీ ఎయిర్ కండీషనర్ వ్యక్తిగత ఉపయోగానికి, చిన్న ప్రదేశాలను చల్లబరచడానికి మంచి ఎంపిక. కొనుగోలు చేసుకునే ముందు మీ అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోండి.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.

Tags:    

Similar News