Electricity Bill: ఈ ప్లాన్‌ అమలు చేస్తే కచ్చితంగా కరెంట్‌ బిల్‌ తగ్గించుకోవచ్చు..!

Electricity Bill: పెరిగిన కరెంట్‌ బిల్లు వల్ల ఇబ్బందిపడుతున్నారా.. అయితే మీ కోసం ఒక ప్లాన్‌ ఉంది.

Update: 2022-06-24 07:30 GMT

Electricity Bill: ఈ ప్లాన్‌ అమలు చేస్తే కచ్చితంగా కరెంట్‌ బిల్‌ తగ్గించుకోవచ్చు..!

Electricity Bill: పెరిగిన కరెంట్‌ బిల్లు వల్ల ఇబ్బందిపడుతున్నారా.. అయితే మీ కోసం ఒక ప్లాన్‌ ఉంది. ఇది మీ కరెంటు బిల్లుని 'జీరో' చేస్తుంది. అదేంటంటే సోలార్‌ ఎనర్జీ. దీనిని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా లభిస్తుంది. సౌరశక్తి సహాయంతో మీరు మీ అవసరానికి అనుగుణంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. అధిక విద్యుత్ బిల్లుల నుంచి తప్పించుకోవచ్చు.

సౌర ఫలకాలను ఏర్పాటు చేసేందుకు మీరు ప్రభుత్వం నుంచి సబ్సిడీని కూడా పొందుతారు. వీటిని ఏర్పాటు చేసుకొని కొన్ని సంవత్సరాల వరకు విద్యుత్‌ బిల్లు నుంచి తప్పించుకోవచ్చు. సోలార్ ప్యానెల్ జీవితకాలం సుమారు 25 సంవత్సరాలు ఉంటుంది. దీనివల్ల మీరు ఉచితంగా విద్యుత్తును ఉపయోగించగలరు. నేటి కాలంలో ప్రభుత్వం సౌరశక్తిని ప్రోత్సహిస్తుంది. ఈ పరిస్థితిలో కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కొత్త సోలార్ రూఫ్‌టాప్ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద 3 kW వరకు సోలార్ ప్యానెల్‌లను స్థాపించడానికి 40 శాతం వరకు సబ్సిడీ అందిస్తోంది.

ఉదాహరణకు మీరు 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌ను ఇన్‌స్టాల్ చేస్తే దాదాపు రూ. 1.2 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో 40% సబ్సిడీ తర్వాత అంటే సుమారు 48 వేల రూపాయలు సబ్సీడీ ఉంటుంది. అంటే 72 వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. సోలార్ ప్యానెళ్లను అమర్చే ముందు మీ ఇంట్లో ఎంత విద్యుత్తు వినియోస్తారో తెలుసుకొని అందుకు సరిపోయే విధంగా ప్యానెల్లను అమర్చుకుంటే మంచిది. అలాగే మీరు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://solarrooftop.gov.in/ లో సోలార్ రూఫ్‌టాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి అప్లై చేసుకోవచ్చు.

Tags:    

Similar News