Samsung Galaxy S25 Series: సామ్‌సంగ్ మాస్టర్ ప్లాన్.. ఐఫోన్‌కు పోటీగా అదిరిపోయే ఫోన్.. ధర ఎంతంటే..!

Samsung Galaxy S25 Series: సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ ఫోన్లను త్వరలో లాంచ్ చేయనుంది. తాజాగా దీని ధర, ఫీచర్లు లీక్ అయ్యాయి.

Update: 2024-09-15 08:10 GMT

samsung galaxy s25 series

Samsung Galaxy S25 Series: సామ్‌సంగ్ కంపెనీ త్వరలో తన కొత్త సిరీస్ ఫోన్ గెలాక్సీ S25ని మార్కెట్లోకి తీసుకురానుంది. తాజాగా దీనికి గురించి కొంత సమాచారం కూడా లీక్ అయింది. ఆ నివేదిక ప్రకారం కంపెనీ ఈ సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది. దీనికి ముందు కూడా, కంపెనీ తన గెలాక్సీ S24 సిరీస్‌లో 3 స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. Galaxy S24 సిరీస్‌ను కంపెనీ ఈ సంవత్సరం మొదటి నెలలో ప్రారంభించింది. ఇప్పుడు కంపెనీ Samsung Galaxy S25 సిరీస్‌కు సంబంధించి లీక్‌లు రావడం స్టార్ట్ అయింంది. Apple iPhone 16 సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత Samsung Galaxy S25 సిరీస్‌ రావడంతో మొబైల్ లవర్స్ భారీ అంచనాలు పెట్టకున్నారు.

తాజా లీక్‌ల ప్రకారం కంపెనీ గెలాక్సీ S25 సిరీస్‌ను అనేక ప్రత్యేక ఫీచర్లతో సన్నద్ధం చేయగలదు. ఈ ఫోన్‌లో హై సెన్సార్, లెన్స్ టెక్నాలజీ ఫెసిలీటీ ఉంటుంది. ఈ సిరీస్‌లో మీరు ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్‌తో వర్టికల్ షేప్ కెమెరా లెన్స్‌ని చూస్తారు. ఫోన్ డిస్‌ప్లే పంచ్ హోల్ డిజైన్‌తో వస్తుంది. దీనిలో మీకు సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. Galaxy S25 సిరీస్‌లో Galaxy S24తో పోలిస్తే కస్టమర్‌లు కొంచెం కాంపాక్ట్, సొగసైన డిజైన్‌ను పొందవచ్చని చాలా నివేదికలు చెబుతున్నాయి. ఇందులో 6.1 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ శాటిలైట్ కనెక్టివిటీతో రావచ్చు.

Samsung Galaxy S25 Series Features
|Samsung Galaxy S25 5G స్మార్ట్‌ఫోన్‌లో Exynos 2500 చిప్‌సెట్ ప్రాసెసర్‌ ఉంటుంది. అయితే ఈ సిరీస్ టాప్ వేరియంట్ Galaxy S25 Ultraలో కంపెనీ Snapdragon 8 Gen 4 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను ఇవ్వనుంది. అదే సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్‌లో గ్రాండ్ కెమెరా సెటప్ కూడా ఉంటుంది. కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి Samsung Galaxy S25 5G సిరీస్‌ను ప్రారంభించవచ్చు. ప్రస్తుతం కంపెనీ దాని లాంచ్, ధరలను ఇంకా వెల్లడించలేదు. కంపెనీ ఈ సిరీస్‌ను దాదాపు రూ. 1.10 లక్షల రేంజ్‌లో మార్కెట్‌లో విడుదల చేయవచ్చు.

సిరీస్‌లో మీరు గరిష్టంగా 12GB RAM + 1TB ఇంటర్నల్ స్టోరేజ్ చూస్తారు. పవర్ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీని ఆఫర్ చేస్తోంది. గెలాక్సీ S25, Galaxy S25 ప్లస్ అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లలోని మెయిన్ కెమెరా 50MP సెన్సార్‌గా ఉంటుంది. అయితే వినియోగదారులు దాని అల్ట్రా మోడల్‌లో 200MP కెమెరాను పొందుతారు. కంపెనీ ఈ సిరీస్‌ను దాదాపు రూ. 1.10 లక్షల రేంజ్‌లో మార్కెట్‌లో విడుదల చేయవచ్చు. 

Tags:    

Similar News