Samsung Galaxy S24 FE: బడ్జెట్ కిల్లర్.. ప్రీమియం ఫీచర్లతో సామ్‌సంగ్ కొత్త ఫోన్..!

Samsung Galaxy S24 FE: సామ్‌సంగ్ తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ Galaxy S24 FEని త్వరలో విడుదల చేయనుంది. ధర, ఫీచర్లు లీక్ అయ్యాయి.

Update: 2024-09-14 10:43 GMT

Samsung Galaxy S24 FE

Samsung Galaxy S24 FE: సామ్‌సంగ్ కంపెనీ తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy S24 FE పేరుతో మార్కెట్లోకి రాబోతోంది. గత కొన్ని నెలలుగా ఈ స్మార్ట్‌ఫోన్ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. సమాచారం ప్రకారం కంపెనీ దీన్ని త్వరలో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఫోన్ లాంచ్ కాకముందే దాని ఫీచర్లు చాలా లీక్‌లలో వెల్లడయ్యాయి. ఇప్పుడు తాజా లీక్‌లో ఈ ఫోన్ ధరను వెల్లడించారు. Samsung Galaxy S24 FE వేరియంట్‌లో ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లోని చాలా ఫీచర్లను చూస్తారని కంపెనీ తెలిపింది. మీరు ఈ ఫోన్‌ని బ్లూ, గ్రాఫైట్, గ్రీన్, ఎల్లో అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy S24 FE Price
ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం కంపెనీ ఈ ఫోన్‌ను రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో లాంచ్ చేయవచ్చు. దాని 128GB వేరియంట్ ధర €749 యూరోలు, 256GB వేరియంట్ ధర €809 యూరోలు కావచ్చు. ఈ నెలలోనే కంపెనీ ఈ ఫోన్‌ను FCC సర్టిఫికేషన్ సైట్‌లో లిస్ట్ చేసింది. ఇంతకు ముందు కూడా కంపెనీ ఈ ఫోన్‌ను అనేక ఇతర ధృవీకరణ సైట్‌లలో లిస్ట్ చేసింది. ఈ ఫోన్ మోడల్ నంబర్ SM-S721B/DSతో FCCలో కనిపించింది. ఈ ఫోన్ అనేక ఫీచర్ల గురించి సమాచారం ఇక్కడ నుండి కూడా వెల్లడైంది.

సామ్‌సంగ్ Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీకి సంబంధించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ ఫోన్ గ్లోబల్ లాంచ్ తేదీకి సంబంధించి కొత్త రిపోర్ట్ వచ్చింది. ఈ నివేదిక ప్రకారం కంపెనీ సెప్టెంబర్ నెలలో గ్లోబల్ మార్కెట్‌లో Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించవచ్చు. దీనికి ముందు కూడా కంపెనీ అదే సమయంలో Galaxy S23 FEని విడుదల చేసింది. FCCకి ముందు ఈ Samsung ఫోన్ బ్లూటూహ్ SIG సర్టిఫికేషన్, గీక్‌బెంచ్ డేటాబేస్‌లో కూడా కనిపించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ డిజైన్‌తో రావచ్చు.

Samsung Galaxy S24 FE Features
ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీరు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది.దీనితో పాటు కంపెనీ ఈ ఫోన్ డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్ కూడా అందింస్తుంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను Exynos 2400 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో లాంచ్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్‌తో రావచ్చు. ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా OneUI 6తో పని చేస్తుంది.

కెమెరా గురించి మాట్లాడితే ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో LED ఫ్లాష్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. దీనిలో మీకు 12MP అల్ట్రావైడ్ లెన్స్, 8MP టెలిఫోటో లెన్స్ కెమెరాతో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ కోసం 10MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. పవర్ కోసం 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4565mAh బ్యాటరీ ఉంది. ఇది 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా అందిస్తుంది. కనెక్టివిటీ కోసం ఫోన్‌లో Wi-Fi6, బ్లూటూత్ 5.3, NFC, వైర్‌లెస్ ఛార్జింగ్, GNSS సపోర్ట్ ఉంటాయి.

Tags:    

Similar News