Navaratri Offers: ఆపిల్‌కు షాక్ ఇచ్చిన సామ్‌సంగ్.. నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది..!
Navaratri Offers: పండుగ సీజన్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోసామ్‌సంగ్ ఆపిల్‌ను వెనుకకు నెట్టింది.
Navaratri Offers: పండుగ సీజన్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లోసామ్‌సంగ్ ఆపిల్‌ను వెనుకకు నెట్టింది. పండుగ సీజన్‌లో మొదటి దశలో 20 శాతం మార్కెట్ వాటాతో స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో నంబర్ల పరంగా సామ్‌సంగ్ అగ్రస్థానంలో ఉంది. సెమీకండక్టర్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్ టెక్ ఇన్‌సైట్స్ ప్రకారం సెప్టెంబర్ 26,అక్టోబర్ 6 మధ్య జరిగిన పండుగ సేల్ సందర్భంగా వినియోగదారులు 1 మిలియన్ కంటే ఎక్కువ ఐఫోన్‌లను కొనుగోలు చేశారు.
టెక్ ఇన్‌సైట్ మంగళవారం ప్రచురించిన ఒక బ్లాగ్‌లో ఫెస్టివల్ సేల్ మొదటి రౌండ్‌లో, సామ్‌సంగ్ 20 శాతం మార్కెట్ వాటాతో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో అగ్రగామిగా ఉండగా, ఆపిల్ రెండవ స్థానంలో ఉంది. ప్రధాన ఈ-కామర్స్ కంపెనీలు - అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తమ ప్లాట్‌ఫామ్‌లో ఫెస్టివల్ సేల్‌ను నిర్వహించాయి. ఇందులో వినియోగదారుల కోసం అనేక రకాల తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్‌లు కూడా అందించారు.
నవరాత్రుల సందర్భంగా ఆఫ్‌లైన్ విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో ఫెస్టివవల్ సేల్‌లో కూడా ప్రధాన స్పాన్సర్‌గా ఉందని, ఇది అదనపు ప్రోత్సాహాన్ని ఇచ్చిందని బ్లాగ్ పేర్కొంది. టెక్ ఇన్‌సైట్స్ అంచనాల ప్రకారం పండుగల విక్రయాల మొదటి దశలో మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో 78 శాతం ఆన్‌లైన్ అమ్మకాలు జరిగాయి. నవరాత్రులు ప్రారంభం కావడంతో ఆఫ్‌లైన్ విక్రయాలు కూడా ఊపందుకున్నాయి.
ఈ పండుగ సేల్‌లో దిగ్గజం ఆపిల్ 16 శాతం మార్కెట్ షేర్‌తో రెండో స్థానంలో నిలవడం ఆశ్చర్యం కలిగించింది. ఐఫోన్ 15, ఐఫోన్ 13 మోడళ్ల విక్రయం ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. ఒప్పో గ్రూప్, షియోమీ, రియల్‌మీ, పండుగ సీజన్ మొదటి దశలో సంఖ్యల పరంగా మొదటి ఐదు స్మార్ట్‌ఫోన్ విక్రేత కంపెనీలలో ఉన్నాయి.