Samsung: ఐఫోన్ 15కు ధీటుగా శాంసన్ గెలాక్సీ ఎస్23 ఎఫ్.. తక్కువ ధరలోనే స్టైలిష్ 5G ఫోన్ విడుదలకు రంగం సిద్ధం..!
Samsung Galaxy S23 FE India Launch: శామ్సంగ్ తన Samsung Galaxy S23 FEని వచ్చే నెలలో అంటే అక్టోబర్‌లో త్వరలో అనేక మార్కెట్లలో విడుదల చేయబోతోంది. మునుపటి FE మోడల్ లాగా, దీని ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది.
Samsung Galaxy S23 FE India Launch: ఐఫోన్ 15 లాంచ్ అయిన వెంటనే, శామ్సంగ్ కూడా ఐఫోన్ 15 ను ధీటుగా వచ్చే నెల అంటే అక్టోబర్‌లో తన Samsung Galaxy S23 FEని విడుదల చేయబోతోంది. మునుపటి FE మోడల్ లాగా, దీని ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. 91మొబైల్స్ నివేదిక ప్రకారం, లీక్‌లలో వెల్లడైనట్లుగా అదే నెలలో Samsung Galaxy S23 FE ప్రారంభించబడుతుందని పేర్కొంది.
Samsung Galaxy S23 FE ఇండియా లాంచ్..
నివేదిక ప్రకారం, Galaxy S23 FE అక్టోబర్ ప్రారంభంలో భారతదేశంలో లాంచ్ అవుతుందని రిటైల్ వర్గాలు వెల్లడించాయి. కంపెనీ త్వరలో ఈ పరికరాన్ని అధికారికంగా టీజ్ చేసే అవకాశం ఉంది. ఇటీవలి లీక్ ప్రకారం, S23 FE 8GB + 128GB, 8GB + 256GB వేరియంట్‌ల ధర వరుసగా రూ. 54,999, రూ. 59,999లుగా ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరికరాన్ని పర్పుల్, గ్రాఫైట్, వైట్, లైమ్ గ్రీన్ వంటి రంగుల్లో అందుబాటులో ఉంచనున్నారు.
Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్..
Samsung Galaxy S23 FE మోస్ట్ ఫవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్‌గా భావిస్తున్నారు. ఇది నిర్దిష్ట మార్కెట్‌ను బట్టి Snapdragon 8 Gen 1 లేదా Exynos 2200 చిప్‌సెట్ ద్వారా అందించే వీలుందని అంటున్నారు. ఇది 6.3-అంగుళాల AMOLED డిస్ప్లే, FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది. ఇది One UI 5.1.1-ఆధారిత ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుందని భావిస్తున్నారు.
Samsung Galaxy S23 FE బ్యాటరీ..
S23 FE 4,500mAh సామర్థ్యంతో శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది 25W ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. అదనంగా, ఇది 8GB RAM, 128GB/256GB స్టోరేజ్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
Samsung Galaxy S23 FE కెమెరా..
వార్తల ప్రకారం, S23 FE శక్తివంతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉంటాయి. సెల్ఫీల కోసం, ఫోన్‌లో 10-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది.