Nothing Phone 2a Plus Community Edition: నథింగ్ నుంచి కొత్త ఫోన్.. 1000 మందికే ఛాన్స్
Nothing Phone 2a Plus Community Edition: నథింగ్ ఫోన్ (2a) ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది.
Nothing Phone 2a Plus Community Edition: నథింగ్ ఫోన్ (2a) ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ గ్రీన్ ఫాస్ఫోరేసెంట్ మెటీరియల్‌తో తయారైంది. కంపెనీ కేవలం 1000 స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే అందుబాటులోకి తెచ్చింది స్టాండర్డ్ 2ఏ ప్లస్ ఫోన్ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో విడుదలైంది. ఈ స్పెషల్ ఎడిషన్ మొబైల్ ఆకర్షణీయంగా ఉంది. కొత్త ఫోన్ ధర, ఫీచర్లను తెలుసుకుందాం.
నథింగ్ ఫోన్ 2A ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ ఫోన్ గ్రీన్ ఫాస్ఫోరేసెంట్ మెటీరియల్ కోటింగ్‌తో తయారైంది. కంపెనీ కేవలం 1000 స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే విడుదల చేసింది. ఇది ఒక స్టోరేజ్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ MediaTek Dimensity 7350 Pro ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. అంతేకాకుండా ఇది 5,000mAh బ్యాటరీ, 6.7 అంగుళాల డిస్‌ప్లేతో చాలా ఫీచర్లను ప్యాక్ చేస్తుంది.
నథింగ్ ఫోన్ 2A ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 29,999. ఇది సాధారణ నథింగ్ ఫోన్ (2a) ప్లస్ 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర. ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నవారు నథింగ్ ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా నమోదు చేసుకోవచ్చు. 1000 స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.
థింగ్ ఫోన్ 2A ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్ 6.7 అంగుళాల పూర్తి HD ప్లస్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7350 Pro ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అదనంగా Mali G610 MC4 GPUని కలిగి ఉంది. ఈ ఫోన్ (2a) Plus నథింగ్ OS 2.6 ఆధారంగా Android 14పై రన్ అవుతుంది. ఇది 3 సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్లు, 4 సంవత్సరాల పాటు సేఫ్లీ అప్డేట్లను పొందుతుంది.
నథింగ్ ఫోన్ 2A ప్లస్ కమ్యూనిటీ ఎడిషన్‌లో 50 మెగాపిక్సెల్ Samsung GN9 ప్రైమరీ కెమెరా ఉంది. OIS, EIS, 10x డిజిటల్ జూమ్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ Samsung JN1 అల్ట్రా-వైడ్ కెమెరా. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ Samsung JN1 ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది 50W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.