OnePlus 13: నంబర్ వన్‌ మొబైల్‌గా వన్‌ప్లస్ 13.. ఎందుకో తెలుసా?

OnePlus 13: వన్‌ప్లస్ 13 మొబైల్ 24 జీబీ వేరియంట్ అక్టోబర్ AnTuTu ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పర్ఫామెన్స్ ర్యాంకింగ్‌లో నంబర్ 1 స్థానాన్ని సాధించింది.

Update: 2024-11-02 15:30 GMT

OnePlus 13

OnePlus 13: వన్‌ప్లస్ 13 మొబైల్ 24 జీబీ వేరియంట్ అక్టోబర్ AnTuTu ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పర్ఫామెన్స్ ర్యాంకింగ్‌లో నంబర్ 1 స్థానాన్ని సాధించింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో కూడిన ఈ ఫోన్ అక్టోబర్ 31న విడుదలైంది. ఇది 2,906,489 స్కోర్ చేసిన iQOO 13 మొబైల్ 16 జీబీ ర్యామ్ వేరియంట్ కంటే 2,926,644 సగటు స్కోర్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్షన్ 9400 ప్రాసెసర్‌తో Vivo X200 Pro శాటిలైట్ కమ్యూనికేషన్ ఎడిషన్‌ను కూడా దాటేసింది.

ఈ Vivo ఫోన్ 2,843,812 స్కోర్‌తో ర్యాంకింగ్‌లో మూడవ స్థానంలో నిలిచింది. Oppo Find X8 Pro ర్యాంకింగ్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. దీనికి 2,842,922 స్కోరు వచ్చింది. కాగా Oppo Find X8 2,814,445 స్కోర్‌తో 5వ స్థానంలో నిలిచింది. కాబట్టి OnePlus 13  ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల గురించి తెలుసుకోండి.

OnePlus 13 Features

కంపెనీ ఈ ఫోన్‌లో 6.82 అంగుళాల 2K Quad HD+ LTPO AMOLED డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz వరకు ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్‌తో కూడిన ఈ డిస్‌ప్లే పీక్ బ్రైట్నెస్ 4500 నిట్‌లతో వస్తుంది. ఫోన్  24 జీబీ ర్యామ్+  1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో ఉంటుంది. ప్రాసెసర్‌గా కంపెనీ ఈ ఫోన్‌లో Adreno 830 GPUతో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను అందిస్తోంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన మూడు కెమెరాలు ఉన్నాయి.

వీటిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌ను పవర్ చేయడానికి 6000mAh బ్యాటరీని అందించారు. ఈ బ్యాటరీ 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. OS గురించి చెప్పాలంటే ఫోన్ Android 15 ఆధారంగా ColorOS 15లో పని చేస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం ఫోన్‌లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 

Tags:    

Similar News