Cheapest 5G Phone: మంచి 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా?.. ఈ నాలుగే బెస్ట్..!
Cheapest 5G Phone: మీరు మంచి 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీ బడ్జెట్ చాలా బడ్జెట్ తక్కువగా ఉంటే చింతించకండి.. ఎందుకంటే 5G స్మార్ట్‌ఫోన్‌లు రూ. 10,000 కంటే తక్కువ ధరకే మార్కెట్‌లోకి వచ్చాయి.
Cheapest 5G Phone: మీరు మంచి 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీ బడ్జెట్ చాలా బడ్జెట్ తక్కువగా ఉంటే చింతించకండి.. ఎందుకంటే 5G స్మార్ట్‌ఫోన్‌లు రూ. 10,000 కంటే తక్కువ ధరకే మార్కెట్‌లోకి వచ్చాయి. ఇవి మంచి పర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా సరికొత్త ఫీచర్‌లతో కూడా ఉన్నాయి. టెక్నో పాప్ 9 5జీ, ఐటెల్ కలర్ ప్రో 5జీ, రెడ్‌మి 13సీ 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లు వాటి శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో ఈ విభాగంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఫోన్‌లు హైస్పీడ్ ఇంటర్నెట్, గొప్ప డిస్‌ప్లే, మంచి బ్యాటరీ లైఫ్‌తో వస్తాయి, వినియోగదారులకు గొప్ప అనుభవాన్ని అందిస్తాయి. ఈ మూడు చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ల ధర, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
TECNO POP 9 5G
ఈ 5G సెగ్మెంట్‌లో 48MP Sony AI కెమెరాతో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ 5G కనెక్టివిటీ, NFC సపోర్ట్‌తో ఈ ధర పరిధిలో ప్రత్యేక ఆప్షన్‌గా మారుతుంది. ఇది D6300 5G ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఫోన్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్ 4 సంవత్సరాల పాటు లాగ్ లేకుండా సాఫీగా నడుస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది కాకుండా 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది లాంగ్ బ్యాకప్ ఇస్తుంది. ఫోన్‌లో డ్యూయల్ స్పీకర్లు కూడా ఉన్నాయి. ఇవి అద్భుతమైన ఆడియోను అందిస్తాయి. అమెజాన్‌లో దీని ధర ప్రస్తుతం రూ.9,499.
itel Color Pro 5G
itel కలర్ ప్రో 5G అద్భుతమైన ఫీచర్లతో లోడై ఉంది. దీని వెనుక ప్యానెల్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇది 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది, ఇది మెమరీ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా 12GB వరకు పెచుకోవచ్చు. డివైస్‌లో డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ ఉంది. ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం 50MP AI డ్యూయల్ వెనుక కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ గురించి చెప్పాలంటే ఇది 5000mAh పెద్ద బ్యాటరీని కలిగి ఉంది. అమెజాన్‌లో దీని ధర ప్రస్తుతం రూ.9,490.
Redmi 13C 5G
ఇది పవర్‌ఫుల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. స్టార్‌లైట్ బ్లాక్ కలర్‌లో వస్తుంది. ఇది 4GB RAM +128GB స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6100+ 5G ప్రాసెసర్ ఉంది. ఇది వేగవంతమైన 5G ఫోన్‌గా చేస్తుంది. దీని డిస్‌ప్లే గురించి చెప్పాలంటే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఫోన్ స్క్రోలింగ్, గేమింగ్‌ను సాఫీగా చేస్తుంది. అమెజాన్‌లో దీని ధర ప్రస్తుతం రూ.8,999.