Samsung Galaxy F14 లాంచ్‌.. ధర, ఫీచర్ల గురించి తెలుసుకోండి..!

Samsung Galaxy F14: ఎట్టకేలకు భారత్‌లో Samsung Galaxy F14 లాంచ్ అయింది.

Update: 2023-03-24 09:59 GMT

Samsung Galaxy F14 లాంచ్‌.. ధర, ఫీచర్ల గురించి తెలుసుకోండి..!

Samsung Galaxy F14: ఎట్టకేలకు భారత్‌లో Samsung Galaxy F14 లాంచ్ అయింది. ఈ ఫోన్ 5G టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఇది 5nm Exynos 1330 ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. దీని కారణంగా వినియోగదారులు వీడియోలను ఎడిట్‌ చేయగలరు. మల్టీ టాస్కింగ్‌ వీడియోలని సులభంగా మెయింటెన్‌ చేయగలరు. దీంతోపాటు వినియోగదారులు గొప్ప గేమింగ్ అనుభవాన్ని కూడా పొందుతారు. ఈ ఫోన్ Android 13-ఆధారిత OneUI కస్టమ్ స్కిన్‌తో వస్తుంది. 6GB వరకు ఎక్స్పాండబుల్ RAM సపోర్ట్‌ని కలిగి ఉంటుంది. ఇది 5G, 4G LTE, WiFi, బ్లూటూత్, USB టైప్-సి పోర్ట్‌లను కలిగి ఉంటుంది.

Samsung Galaxy F14 స్పెసిఫికేషన్

1. 5G టెక్నాలజీ

2. 5nm Exynos 1330 ప్రాసెసర్

3. 50MP ప్రైమరీ కెమెరా

4. 6000mAh బ్యాటరీ

5. 25W ఫాస్ట్ ఛార్జింగ్

Samsung Galaxy F14 డిస్ప్లే

కొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ 90 Hz. ఇది కాకుండా సేఫ్టీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ నాచ్ ఫోన్‌లో ఉంటుంది.

Samsung Galaxy F14 కెమెరా

Samsung F14 5G వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 13MP ఫ్రంట్ కెమెరా ఉంది.

Samsung Galaxy F14 బ్యాటరీ

ఈ స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే బ్యాటరీ రెండు రోజుల పాటు వస్తుందని కంపెనీ పేర్కొంది.

Samsung Galaxy F14 ధర

Samsung Galaxy F14 ప్రారంభ ధర రూ.12,990. ఫోన్ 4GB/128GB వేరియంట్ ధర రూ.12,990. 6GB/128GB వేరియంట్ ధర రూ.14,990. ఈ ధర ప్రారంభ కస్టమర్ల కోసం అని గుర్తుంచుకోండి. కంపెనీ ధరలను తర్వాత మార్చే అవకాశాలు ఉన్నాయి. మార్చి 30 నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. దీనిని Samsung వెబ్‌సైట్, Flipkart, ఇతర రిటైల్ స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4 సెక్యూరిటీ అప్‌డేట్స్‌, 2 ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లు అందుబాటులో ఉంటాయి.

Tags:    

Similar News