Samsung: తక్కువ ధర, అదిరే ఫీచర్లతో కొత్త గెలాక్సీ ఏ22 స్మార్ట్ ఫోన్
Samsung: శామ్ సంగ్ కొత్త గెలాక్సీ ఏ22 స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది.
Samsung: తక్కువ ధరలో, అదిరే ఫీచర్లతో సామ్ సంగ్ వరుసగా స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ భారతదేశం మార్కెట్లో తన స్థానాన్ని పదిలపరుచుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే భారత్‌లో కొత్త గెలాక్సీ ఏ22 స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది. 5జీ టెక్నాలజీతో వచ్చే ఈ డివైజ్‌లో15W ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నట్టు టియువి రీన్‌ల్యాండ్ వెబ్‌సైట్ ధ్రువీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల గురించి గత కొన్ని నెలలుగా వివిధ వెబ్‌సైట్లలో లీకులు వస్తున్నాయి.
ఈ ఫోన్ 4G, 5G రెండు వేరియంట్లలో తయారవుతున్నట్లు సమాచారం. అతి త్వరలోనే గెలాక్సీ A22 5G తో పాటు గెలాక్సీ F22ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మోడల్ నంబర్ SM-A226Bతో శామ్‌సంగ్ గెలాక్సీ A22 5G వేరియంట్ భారత మార్కెట్లోకి A22 5G వేరియంట్ KRW 2,00,000 (సుమారు రూ. 13,100) ధరతో విడుదల కానుందని సమాచారం. ఇది లైట్ గ్రీన్, వైట్ షేడ్స్ సహా మొత్తం నాలుగు విభిన్న కలర్ ఆప్షన్లలో లభించనుందని ప్రాథమిక తెలుస్తోంది. టిప్‌స్టర్ సుధాన్షు అంబోర్ టియువి రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ సైట్ నుంచి తీసిన స్క్రీన్‌షాట్‌ను ట్వీట్టర్లో పంచుకున్నారు.