IRCTC Forget Password: IRCTC పాస్‌వర్డ్ మర్చిపోయారా.. డోంట్ వర్రీ.. ఇలా సింపుల్‌గా రీసెట్ చేయండి..!

IRCTC Forget Password: IRCTC పాస్‌వర్డ్ మర్చిపోతే ఈ సింపుల్ స్టెప్స్‌తో రీసెట్ చేయండి.

Update: 2024-09-04 12:47 GMT

IRCTC Forget Password

IRCTC Forget Password: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)ని దేశంలో చాలా మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే దీని ద్వారా ట్రైన్ టికెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో మీరు దీపావళి రోజున ఇంటికి వెళ్లడానికి రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు IRCTC అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా? ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. IRCTC పాస్‌వర్డ్‌ను సులభంగా రీసెట్ చేయవచ్చు. పాస్‌వర్డ్ లేకుండా IRCTC నుంచి టిక్కెట్ బుక్ చేయలేరు.

IRCTC పాస్‌వర్డ్‌ను ఎలా రీసెట్ చేయాలి..?

1. దీని కోసం, ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, ఆపై మీ IRCTC అకౌండ్ IDని ఎంటర్ చేయండి.

2.ఇప్పుడు మీరు Forget Password ఆప్షన్‌లోకి వెళ్లాలి.

3. ఇప్పుడు మీ రిజిస్టర్ ఇమెయిల్ ID, IRCTC యూజర్ ID, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.

4. దీని తర్వాత, IRCTC వినియోగదారుడు తన రిజిస్టర్డ్ ఇమెయిల్ IDలో సమాచారాన్ని పొందుతారు.

5. దాన్ని ఉపయోగించి వినియోగదారు ID, పాస్‌వర్డ్‌ను తిరిగి పొందవచ్చు.

6. ఇప్పుడు మీరు IRCTC అకౌంట్ పాస్‌వర్డ్‌ను మార్చవచ్చు. మీరు గుర్తుంచుకోగలిగే పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయవచ్చు.

7. తర్వాత మీరు IRCTC అకౌంట్‌లో కొత్తగా రూపొందించిన పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి.

8. ఇప్పుడు మీరు IRCTC ఖాతాలోకి లాగిన్ చేయడం ద్వారా మీ రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకోగలరు.

9. మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి మీ IRCTC మీ అకౌంట్‌ను రీస్టోర్ చేయవచ్చు.

10. పాస్‌వర్డ్ రీస్టోరేషన్ పేజీలో మీ రిజిస్టర్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.

11. దీని తర్వాత ఫోన్‌కు OTP (వన్-టైమ్ పాస్‌వర్డ్) పంపబడుతుంది.

12. రీస్టోర్ పేజీలో ఈ కోడ్‌ను ఎంటర్ చేయండి. కొత్త పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయండి.

Tags:    

Similar News