మద్యం తాగి వాహనం నడిపే వారికి చుక్కలే.. ముఖాన్ని చూసే పట్టేసే ఏఐ టెక్నాలజీ..!

AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేథ వినియోగం అనివార్యంగా మారింది.

Update: 2024-07-26 03:23 GMT

AI: మద్యం తాగి వాహనం నడిపే వారికి చుక్కలే.. ముఖాన్ని చూసే పట్టేసే ఏఐ టెక్నాలజీ..!

AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేథ వినియోగం అనివార్యంగా మారింది. ఈకామర్స్‌ మొదలు అధునాతన కార్ల వరకు అన్నింటిలో ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. రోజురోజుకీ విస్తరిస్తున్న ఏఐ టెక్నాలజీతో తాజాగా మద్యం తాగి వాహనం నడిపే వారిని పట్టేసే టెక్నాలజీ వస్తోంది. పరిశోధకులు రూపొందిస్తున్న కొత్త అల్గారిథమ్‌ ద్వారా 75 శాతం కచ్చితత్వంతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేస్తున్న వారిని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లతో పాటు కంప్యూటర్ విజన్ ఫౌండేషన్ కాన్ఫరెన్స్ కలిసి పనిచేస్తున్నాయి. ఈ AI కెమెరా కంప్యూటర్ స్టీరింగ్ నమూనా, పెడల్ వినియోగంతో పాటు వాహన వేగం వంటి పరిశీలనాత్మక ప్రవర్తనపై పని చేస్తుంది. కారు కదులుతున్నప్పుడు ఈ డేటాను అదే సమయంలో విశ్లేషిస్తుంది. ఇందులో భాగంగా వాహనం నడుపుతున్న వ్యక్తి చూస్తున్న దిశతో పాటు తల స్థానాన్ని గమనించే కెమెరాను ఉపయోగించనున్నారు.

ఏఐ అల్గారిథమ్‌ ఎలా పనిచేస్తుందంటే..

డ్రైవర్‌ స్టీరింగ్‌ను ఎలా ఉపయోగిస్తున్నాడు. అతని ముఖ కవళికలు ఎలా ఉన్నాయి లాంటివన్ని రికార్డ్ చేస్తుంది. ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయంలో డాక్టరల్ విద్యార్థి ఎన్సీయేహ్ కేష్ట్‌కరన్ ఈ విషయమై మాట్లాడుతూ.. డ్రైవింగ్ ప్రారంభంలోనే మత్తు స్థాయి ఏమిటో గుర్తించే సామర్థ్యాన్ని తమ వ్యవస్థ కలిగి ఉందని చెబుతున్నారు. ఐ ట్రాకింగ్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్‌ల ఆధారంగా ఈ విషయాలను అంచనా వేస్తారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచంలో జరిగే 20 నుంచి 30 శాతం కారు ప్రమాదాలకు మద్యం తాగి నడపడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు ఆస్ట్రేలియాలో శ్రీకారం పడింది. ఆస్ట్రేలియాలో జరిగే 30 శాతం తీవ్రమైన కారు ప్రమాదాలకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కారణమని తేలింది. ఈ అల్గారిథమ్ ద్వారా భవిష్యత్తులో ఈ ప్రమాదాలను నివారించవచ్చని ఎన్సీయేహ్ కేష్ట్‌కారన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News