HMD New Smartphone: కొత్త సరుకు.. హెచ్ఎమ్‌డీ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది..!

HMD New Smartphone: హెచ్ఎమ్‌డీ స్కైలైన్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేయనుంది. దీని ధర రూ. 41,950.

Update: 2024-09-16 09:17 GMT

HMD New Smartphone: HMD తన కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయబోతోంది. లాంచ్‌కు ముందు, కంపెనీ ఈ రాబోయే ఫోన్ టీజర్‌ను షేర్ చేసింది. ''what it means to touch the sky' అనే ట్యాగ్‌లైన్‌ని టీజర్‌ విడుదల చేసింది. ఈ ఫోన్ పేరు HMD స్కైలైన్ అని టెక్ నిపుణులు ఊహిస్తున్నారు. ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా జూలైలో విడుదలైంది. ఫోన్ అతిపెద్ద ఫీచర్ 'జెన్ 2 రిపేరబిలిటీ' సపోర్ట్, ఇది స్క్రీన్, బ్యాటరీ లేదా ఛార్జింగ్‌కు సంబంధించిన సమస్యలను స్వంతంగా పరిష్కరించుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్‌లో కంపెనీ అనేక శక్తివంతమైన ఫీచర్లను అందిస్తోంది. దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కంపెనీ ఈ ఫోన్‌లో 6.55 అంగుళాల P-OLED ఫుల్ HD+ డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లే ప్రొటక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 3 కూడా ఫోన్‌లో ఉంటుంది. ఫోన్ రెండు వేరియంట్‌లలో వస్తుంది. అందులో 8 GB + 128 GB, 12 GB + 256 GB. ప్రాసెసర్‌గా మీరు దీనిలో Snapdragon 7s Gen 2ని చూడవచ్చు. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ LED ఫ్లాష్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ బ్యాక్ ఉంటుంది.

ఇది 108 మెగాపిక్సెల్ OIS మెయిన్ కెమెరాతో పాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఫోన్‌లో అందించిన బ్యాటరీ 4600mAh. ఈ బ్యాటరీ 33 వాట్ల వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇందులో కంపెనీ 15 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా అందిస్తోంది. భద్రత కోసం ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

ఈ ఫోన్‌ eSIMకి కూడా సపోర్ట్ చూస్తుంది. IP54 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌ను కూడా పొందుతారు. OS విషయానికొస్తే ఈ ఫోన్ Android 14లో రన్ అవుతుంది. కంపెనీ ఈ ఫోన్‌కు రెండు ప్రధాన OS అప్‌గ్రేడ్‌లను కూడా ఇస్తుంది. ఫోన్ బ్లూ టోపాజ్, ట్విస్టెడ్ బ్లాక్, నియాన్ పింక్ అనే మూడు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. గ్లోబల్ మార్కెట్‌లో ఫోన్ బేస్ వేరియంట్ ధర $499 (దాదాపు రూ. 41,950).

Tags:    

Similar News