Jio: జియో సంచలనం.. ఏకంగా చైనాని దాటేసింది..!
Jio: డేటా ట్రాఫిక్ పరంగా రిలయన్స్ జియో ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్. రిలయన్స్ జియో జనవరి నుండి సెప్టెంబర్ 2024 వరకు మొదటి మూడు త్రైమాసికాల్లో డేటా వినియోగంలో చైనా సంస్థ చైనా మొబైల్ కంటే ముందుంది.
Jio: డేటా ట్రాఫిక్ పరంగా రిలయన్స్ జియో ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్. రిలయన్స్ జియో జనవరి నుండి సెప్టెంబర్ 2024 వరకు మొదటి మూడు త్రైమాసికాల్లో డేటా వినియోగంలో చైనా సంస్థ చైనా మొబైల్ కంటే ముందుంది.
గ్లోబల్ టెలికాం రంగ పరిశోధనా సంస్థ టిఫికాంట్ ప్రకారం.. జియో చైనా మొబైల్ తర్వాత డేటా ట్రాఫిక్‌లో మరో చైనా కంపెనీ చైనా టెలికాం మూడవ స్థానంలో ఉండగా, భారతీయ కంపెనీ ఎయిర్‌టెల్ నాల్గవ స్థానంలో ఉంది. వోడా ఐడియా ఆరో స్థానంలో ఉంది.
చైనీస్ కంపెనీ TiFcient తన ట్వీట్‌లో పేర్కొంది. చైనా మొబైల్ కేవలం 2 శాతం వార్షిక వృద్ధిని సాధించగా జియో, చైనా టెలికాం దాదాపు 24 శాతం, ఎయిర్‌టెల్ 23 శాతం వృద్ధిని సాధించాయి.
5G నెట్‌వర్క్‌ల బలమైన ఉనికి భారతీయ సంస్థలలో డేటా ట్రాఫిక్ పెరుగుదలకు దారితీసింది. అదే సమయంలో 5G చైనా డేటా ట్రాఫిక్‌పై భారతదేశం వలె ఎక్కువ ప్రభావాన్ని చూపలేకపోయింది.
5G, హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌కు బలమైన డిమాండ్ కూడా ప్రపంచంలోనే డేటా ట్రాఫిక్‌లో జియో నంబర్ వన్‌గా మారడంలో ప్రధాన పాత్ర పోషించింది. గత మూడేళ్లలో జియో నెట్‌వర్క్‌లో డేటా ట్రాఫిక్ దాదాపు రెండింతలు పెరిగింది.
దాదాపు 14 కోట్ల 80 లక్షల మంది కస్టమర్లు జియో 5జీ నెట్‌వర్క్‌లో చేరారు. జియో ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో దాని మొత్తం డేటా ట్రాఫిక్ 45 ఎక్సాబైట్‌లను దాటింది.
జియో 1029
ఈ ప్లాన్‌లో మొత్తం 84 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు రోజుకు 2 GB డేటా ప్రయోజనం పొందుతారు. మొత్తం వాలిడిటీలో 168 GB డేటా ప్రయోజనం పొందుతారు. అలాగే ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎమ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. దీనితో పాటు జియో యాప్స్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
జియో 1028
ఈ ప్లాన్‌లో మొత్తం 84 రోజుల వాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్‌లు రోజుకు 2 GB డేటా పొందుతారు. మొత్తం వాలిడిటీలో 168 GB డేటా పొందుతారు. అలాగే ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు అమెజాన్ వీడియో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
జియో రూ. 999
ఈ ప్లాన్‌లో మొత్తం 98 రోజుల వాలిడిటీతో ఉంటుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 3 GB డేటా లభిస్తుంది. మొత్తం వాలిడిటీలో 196 GB డేటా బెనిఫిట్స్ పొందుతారు. అలాగే ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లు ఉంటాయి.