Redmi Note 10S: రెడ్‌మీ నోట్ 10S లాంచ్ ఎప్పుడంటే!
Redmi Note 10S: రెడ్ మీ నోట్ 10ఎస్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో మే 13న లాంచ్ కానుంది. 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లే ఉంది.
Redmi Note 10S: రెడ్ మీ నోట్ 10ఎస్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో మే 13న లాంచ్ కానుంది. ఇందులో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీంతోపాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు.
అయితే ధర విషయంలో.. రెడ్ మీ నోట్ 10 రేంజ్‌లోనే ఉండేందుకు అవకాశం ఉంది. రెడ్ మీ నోట్ 10 ధర ప్రస్తుతం మనదేశంలో రూ.12,499గా ఉంది. రెడ్ మీ నోట్ 10ఎస్ టీజర్ ప్రకారం ఈ ఫోన్ బ్లూ, డార్క్ గ్రే, వైట్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌లతో రిలీజ్ అవనుందని టాక్ వినిపిస్తోంది.
రెడ్ మీ నోట్ 10ఎస్ గ్లోబల్ మోడల్ ఇప్పటికే లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ నడుస్తుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ని అందించారు.
ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 MP కాగా, దీంతోపాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 MP డెప్త్ సెన్సార్, 2 MP మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 MP కెమెరాను అందించారు.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.