Portable Fan: ఫ్యాన్ అంటే ఇది భయ్యా.. రాకెట్ కంటే వేగం.. ఇంటినే మంచులా మార్చేస్తుంది.. ధర రూ.700లలోపే..!
UN1QUE MINI X1 Portable Fan: వేసవికాలం వచ్చేసింది. మాడుపగిలే ఎండ వేడిమిని తట్టుకోవడానికి చాలామంది ఏసీలు, కూలర్లు వాడుతుంటారు.
UN1QUE MINI X1 Portable Fan: వేసవికాలం వచ్చేసింది. మాడుపగిలే ఎండ వేడిమిని తట్టుకోవడానికి చాలామంది ఏసీలు, కూలర్లు వాడుతుంటారు. దీంతో ఇంట్లోనే కాదు, ఆఫీస్‌లోనూ హాయిగా ఉంటుంటారు. అయితే, ఇవి చాలా ఖరీదుగా ఉండడంతో, సామాన్యులు వీటిని కొనేందుకు ఆలోచిస్తుంటారు. మార్కెట్‌లో వీటిని ప్రత్నామ్యయంగా కొన్ని పోర్టబుల్ కూలర్లు, ఫ్యాన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి చూడ్డానికి చిన్నవిగా ఉన్నా.. మనకు కావాల్సిన చల్లదనాన్ని అందించడంలో మాత్రం వెనకాడవు. ఇలాంటిదే మార్కెట్‌లో తెగ సందడి చేస్తోంది. అదేంటి, దాని ఫీచర్లు, ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
UN1QUE X1 మినీ ఫ్యాన్ చూడ్డానికి చిన్నదే కావొచ్చు. కానీ దాని శక్తివంతమైన బ్రష్లెస్ మోటార్ మాత్రం.. చల్లని గాలిని ఇవ్వడమే కాదండోయ్.. వేగంగానూ తిరిగి, మనను హాయిగా ఉంచేలా చూస్తుంది. ఇది మీ పాకెట్‌లో పెట్టుకుని ఎటైనా తీసుకెళ్లవచ్చు.
UN1QUE X1 Mini Fan ఫీచర్‌లు..
బూస్టెడ్, దీర్ఘకాల బ్రష్లెస్ మోటార్: UN1QUE X1 Mini Fan లో అందించిన బ్రష్లెస్ మోటార్ ద్వారా శక్తివంతమైన, స్థిరమైన గాలిని అందించడంలో దిట్ట. ఇది ఉష్ణ వాతావరణంలో చల్లగా ఉండేలా చూస్తుంది. మోటార్ దీర్ఘకాల ప్రదర్శనను అందిస్తుంది.
స్పీడ్ మోడ్: మీరు మీ అవసరాలకు అనుకూలమైన గాలి స్పీడ్‌ను ఎంచుకోవడానికి 3 స్పీడ్ కంట్రోల్స్ ఉన్నాయి. స్పీడ్‌ను మార్చడానికి, పవర్ బటన్‌ను నొక్కితే సరిపోతాయి. కనీస స్పీడ్ 3500r/m, మధ్యస్థాయి స్పీడ్ 4500r/m, హై-స్పీడ్ 7500r/m1.
దీర్ఘకాల బ్యాటరీ: వ్యక్తిగత ఫ్యాన్‌ను రీఛార్జ్ చేయడం ద్వారా వాడుకోవచ్చు. దీనికి ఒక ఛార్జింగ్ కేబుల్ అందించారు. UN1QUE X1 Mini Fan బ్యాటరీ 3.8 గంటల వరకు గాలిని అందించనుంది. UN1QUE X1 Mini Fan నీలం (Blue), వైట్ (White) రంగుల్లో అందించారు.
ధర..
ఈ పోర్టబుల్ ఫ్యాన్ అసలు ధర రూ. 1499లుగా ఉంది. అయితే, 56 శాతం తగ్గింపుతో ఇది కేవలం రూ. 649లకే అందుబాటులో ఉంది.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.