Realme X9 Series: ఎక్స్ 9 సిరీస్‌లో రెండు ఫోన్లు రిలీజ్ చేయనున్న రియల్‌మీ!
Realme X9 Series: రియల్ మీ సంస్థ వరుసగా స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ... విఫణిలో దూసుకపోతోంది.
Realme X9 Series: రియల్ మీ సంస్థ వరుసగా స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తూ... విఫణిలో దూసుకపోతోంది. తాజాగా సంస్థ నుంచి ఎక్స్ 9 సిరీస్ నుంచి రెండు ఫోన్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. రియల్ మీ ఎక్స్ 9, రియల్ మీ ఎక్స్ 9 ప్రో విడుదల కానున్నట్లు సమాచారం తెలుస్తోంది.
కాగా, ఈ ఫోన్లు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778 SoC, స్నాప్‌డ్రాగన్ 870 SoC తో రానున్నట్లు తాజా లీక్‌లు సూచిస్తున్నాయి. మోడల్ నంబర్ RMX3366 ఉన్న రియల్ మీ ఫోన్ కొన్ని వెబ్‌సైట్లట్లో దర్శనమిచ్చినట్లు టెక్ నిపుణులు పేర్కొన్నారు. ఇది రియల్ మీ ఎక్స్ 9 ప్రో అని వారు వెల్లడిస్తున్నారు. స్పెసిఫికేషన్లతో పాటు రియల్ మీ ఎక్స్ 9 రేటు కూడా లీకయ్యాయి. కానీ, ఎప్పుడు విడుదలయ్యేది మాత్రం తెలియరాలేదు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండియాలో విడుదలైన రియల్ మీ ఎక్స్ 7 సిరీస్‌కు అనుబంధంగా ఈ రియల్ మీ ఎక్స్ 9 సిరీస్ విడుదల కానుందంట. రియల్ మీ ఎక్స్ 7 సిరీస్ మాదిరిగానే, రియల్ మీ ఎక్స్ 9 సిరీస్ లో రియల్ మీ ఎక్స్ 9, రియల్ మీ ఎక్స్ 9 ప్రో అనే రెండు వేరియంట్లలో ఫోన్లు విడుదల కానున్నాయి. కాగా, ప్రో వేరియంట్ గత కొంతకాలంగా నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వీబో నుంచి వచ్చిన తాజా లీక్‌లు రియల్ మీ ఎక్స్ 9.. లెటెస్ట్ గా విడుదలైన స్నాప్‌డ్రాగన్ 778 SoC తో, ప్రో వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 870 SoC తో పనిచేస్తుందంట.
రియల్‌మే ఎక్స్ 9 సిరీస్ ధర 2,000 సీఎన్‌వై (సుమారు రూ .22,800) గా ఉండనుంది. అలాగే రియల్ మీ ఎక్స్ 9 ప్రోకు 2,500 సీఎన్‌వై (సుమారు రూ. 28,500) గా ఉండనుందని టిప్‌స్టర్ పేర్కొంది.
కాగా, ఈ ఫోన్ 6.55-అంగుళాల పూర్తి HD + OLED డిస్‌ప్లేతో రానుందని భావిస్తున్నారు. 2,200 ఎంఏహెచ్ బ్యాటరీతో లిస్టింగ్ అయిందని, ఇందులో డ్యూయల్ బ్యాటరీ సెటప్ ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫోన్‌లో మొత్తం సామర్థ్యం 4,400 ఎమ్ఏహెచ్ లేదా 4,500 ఎమ్ఏహెచ్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఫోన్ 5 జీ మోడ్‌లో విడుదల కానున్నాయని, ఆండ్రాయిడ్ 11 తో ఈఫోన్లు పనిచేయనున్నాయని టాక్. రియల్ మీ ఎక్స్ 9 ప్రో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉందని టెక్ నిపుణులు అంటున్నారు.