Ola E-Scooter: భారీ అంచనాల మధ్య భారత మార్కెట్లోకి అడుగు పెట్టబోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆగష్టు 15న ఓలా యాజమాన్యం లాంచ్ చేసింది. ఇటీవలే ఆన్లైన్ లో 499 రూపాయలతో ప్రీ బుకింగ్ మొదలుపెట్టిన 24 గంటల్లోనే లక్షకు పైగా బుకింగ్స్ సాధించి ప్రపంచంలోనే అత్యధికంగా బుకింగ్స్ సాధించిన ఈ-స్కూటర్ గా ఓలా రికార్డు సృష్టించింది. ఇక తాజాగా ఓలా వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ ఆదివారం ఓలా లాంచింగ్ ఈవెంట్ లో భాగంగా రెండు రకాల మోడల్స్ ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చాడు.
ఎస్ 1, ఎస్ 1 ప్రొ మోడల్ పేరుతో విడుదల కానున్న ఈ రెండు ఓలా ఈ-స్కూటర్ మోడల్స్ ను సెప్టెంబర్ లో అమ్మకాలను మొదలుపెట్టి అక్టోబర్ నెలలో వినియోగదారులకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను డెలివరీ చేయనుంది. ఓలా ఎస్ 1 మోడల్ లో 5 కలర్స్, ఎస్ 1 ప్రొలో 10 కలర్స్ రెడ్, స్కైబ్లూ, యెల్లో, గోల్డ్, పింక్, నేవీ బ్లూ, గ్రే, వైట్ తో మార్కెట్ లోకి రానుంది. 750W పోర్టబుల్ ఛార్జర్‌తో కేవలం 18 నిమిషాల్లో ఓలా సూపర్‌ఛార్జర్‌ని ఉపయోగించి 50% వరకు ఛార్జ్ చేయవచ్చు. రివర్స్ మోడ్, ఇన్ బిల్ట్ స్పీకర్స్, సెన్సార్స్ తో పాటు హిల్ హోల్డ్ ఫీచర్ ను కూడా ఓలా ఈ స్కూటర్ లో మనం చూడొచ్చు. ఇక ధరల విషయానికొస్తే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1 మోడల్ ధర రూ.99,999 గా నిర్ణయించగా ఎస్1 ప్రో ధరను రూ.1,29,999 గా కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది.