NASA: సునీత విలియమ్స్ జీతం ఎంత? నాసా వ్యోమగాములకు ఉండే బెనిఫిట్స్ ఏంటి?
Sunita Williams: ఇప్పుడంతా సునీతా విలియమ్స్ గురించే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ISSలో 9నెలలకు పైగా గడిపిన ఆమె గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అందరిలో కలుగుతోంది.

NASA: సునీత విలియమ్స్ జీతం ఎంత? నాసా వ్యోమగాములకు ఉండే బెనిఫిట్స్ ఏంటి?
Sunita Williams: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వ్యోమగాములు బుచ్ విల్‌మోర్, సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం-ISSలో సహాసమే చేశారు. ఎనిమిది రోజులపాటు కొనసాగాల్సిన మిషన్‌లో పాల్గొన్నా ఈ ఇద్దరూ సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిది నెలలకు పైగా స్పేస్ స్టేషన్‌లోనే గడిపారు. మరి ఇంతకాలానికి వారికి అదనంగా ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఈ ఇద్దరు ఎంత వేతనం అందుకున్నారనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. నాసా వ్యోమగాములు కూడా సాధారణ ప్రభుత్వ ఉద్యోగులే. వారి వేతనం ఫిక్స్‌డ్‌గానే ఉంటుంది. అదనపు గంటలు పనిచేసినా ఎలాంటి అదనపు వేతనం ఉండదు. మాజీ నాసా వ్యోమగామి కెడి కొల్మన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతరిక్ష ప్రయాణం కూడా సాధారణ పనిలో భాగమే.
శాలరీ ఎంత?
ఇక ఐఎస్ఎస్‌లో ఉన్న సమయంలో వ్యోమగాముల ఆహారం ఖర్చులను నాసా భరిస్తుంది. ఇక సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ ఇద్దరూ GS-15 వేతన శ్రేణిలో ఉన్నారు. ఇది అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ టేబుల్‌లో టాప్. దీని ప్రకారం సంవత్సరానికి సుమారుగా రూ. 1.08 కోట్లు నుంచి రూ. 1.41 కోట్లు వరకూ వేతనం ఉంటుంది.
ఇక ఈ మిషన్ మొదట బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌షిప్‌లో భూమికి తిరిగి రావాల్సి ఉంది. కానీ, సాంకేతిక లోపాల కారణంగా ఈ ప్రయాణం ఆలస్యమైంది. నాసా కొత్త సాంకేతిక మార్గాలను అన్వేషించి, చివరికి స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా వీరిని భూమికి తిరిగి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా నింగిలోకి ప్రయాణించింది. ఇందులో నలుగురు కొత్త వ్యోమగాములు కూడా ఉన్నారు. వీరిలో అమెరికా వ్యోమగాములు అన్నే మెక్‌క్లెయిన్, నికోల్ ఏయర్స్, జపాన్ వ్యోమగామి టకుయా ఒనిషి, రష్యా వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ ఉన్నారు.