Moto New Phones: మోటోను కొట్టడం కష్టమే.. నాలుగు కొత్త బడ్జెట్ ఫోన్లు.. మాములుగా ఉండదు..!

Moto New Phones: మోటో రెండు G-సిరీస్ ఫోన్‌లను విడుదల చేసింది. వాటిలో Moto G64 5G, Moto G85 5G ఉన్నాయి. వీటిని బడ్జెట్ సెగ్మెంట్‌లో తీసుకురానుంది.

Update: 2024-08-15 07:37 GMT

Moto New Phones

Moto New Phones: మోటరోలా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటికే అన్నీ సెగ్మెంట్‌లలో వరుస లాంచ్‌లతో దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు తాజాగా రెండు G-సిరీస్ ఫోన్‌లను విడుదల చేసింది. వాటిలో Moto G64 5G, Moto G85 5G ఉన్నాయి. మోటో, లెనోవా బ్రాండింగ్‌లో ఈ కొత్త ఫోన్లను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా SmartPrix నుండి వచ్చిన ఒక కొత్త నివేదిక ప్రకారం Moto G35 5G, Moto G45 అనే మిడ్ రేంజ్ ఫోన్లను కూడా త్వరలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. వీటి డిజైన్, స్పెసిఫికేషన్లు తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Moto G45 5G Design
మోటో G45 5జీ స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో చంకీ బెజెల్స్‌తో పంచ్-హోల్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్ ఒక ఎత్తైన కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది, ఇందులో డ్యూయల్-కెమెరా సెటప్, పిల్ ఆకారపు LED ఫ్లాష్ ఉన్నాయి. ఇది బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్ గ్రీన్, వివా మెజెంటా అనే మూడు కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.

Moto G45 5G Specifications
నివేదిక ప్రకారం మోటో G45 5G HD+ రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించే 6.5-అంగుళాల LCD ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్‌లో స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 చిప్‌సెట్, 4 GB RAM ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ గురించి ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. ఇది 5,000mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీనిని USB-C పోర్ట్ ఉపయోగించి ఛార్జ్ చేయవచ్చు.

ఫోన్ కెమెరా విషయానికి వస్తే ఇందులో సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. వెనుక ప్యానెల్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ ఉన్నాయి. సమాచారం ప్రకారం Moto G45 5G ధర సుమారు రూ. 15,000 (~$178). లాంచ్ విషయానికొస్తే ఈ నెలాఖరులో ఇది భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News