Moto G85 5G: కొత్త రంగులో మోటో.. కలర్ చూస్తే మతిపోతుందంతే!

Moto G85 5G: Moto G85 5Gని కొత్త కలర్ వేరియంట్‌లో విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

Update: 2024-10-01 10:43 GMT

Moto G85 5G: మోటరోలా అభిమానులకు శుభవార్త. కంపెనీ Moto G85 5Gని కొత్త కలర్ వేరియంట్‌లో విడుదల చేసింది. ఫోన్‌ను కోబాల్ట్ బ్లూ, అర్బన్ గ్రే, ఆలివ్ గ్రీన్ అనే మూడు కలర్స్‌లో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ ఈ ఫోన్‌ను వివా మెజెంటా కలర్‌లో ప్రవేశపెట్టింది. పింక్ కలర్ ఇష్టపడే వారు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. మోటరోలా ఈ ఏడాది జూలైలో స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 SOCతో Moto G85ని భారతదేశంలో విడుదల చేసింది.

Moto G85 Price
మోటో ఈ కొత్త ఫోన్ కలర్ వేరియంట్‌ను ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో Moto G85 స్మార్ట్‌ఫోన్ 8GB + 128GB మోడల్‌ను రూ. 16,999కి, 12GB + 256GB వెర్షన్‌ను రూ. 18,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ధర తగ్గింపు అన్ని కలర్ వేరియంట్‌ల మీద మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా వినియోగదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే వారు రూ.750 తగ్గింపును పొందవచ్చు. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి EMI ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1250 తగ్గింపు లభిస్తుంది.

Moto G85 5G Features
మోటో G85 5G ఫోన్ 1,080 x 2,400 పిక్సెల్‌లతో 6.67 అంగుళాల 3D కర్వ్డ్ పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,600 nits పీక్ బ్రైట్నెస్ అందిస్తోంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 చిప్‌సెట్‌ ప్రాసెసర్ ఉంది. Adreno 619 GPUతో 12GB వరకు RAM + 256GB UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ Android 14 OS, 2 సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌తో వస్తుంది.

ఫోన్‌లో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌నుఉంది. ఇందులో OIS సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఇది సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్, డాల్బీ అట్మాస్, స్టీరియో స్పీకర్లు ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. Moto G85 5G 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Tags:    

Similar News