Moto G60: అదిరిపోయే ఫీచర్లతో మోటో జీ60?

Moto G60: మోటో జీ మోడల్స్ లో మరో రెండు నూతన ఫోన్ లను రిలీజ్ చేసేందుకు మోటరోలా రెడీ అయింది.

Update: 2021-04-13 10:10 GMT
మోటో జీ60 (ఫొటో ట్విట్టర్) 

Moto G60: మోటో జీ మోడల్స్ లో మరో రెండు నూతన ఫోన్లు రిలీజ్ చేసేందుకు మోటరోలా రెడీ అయింది. అయితే వీటిలో ఫీచర్లు మాత్రం కేక పుట్టేలా ఉన్నాయంటున్నాడు ఈ టిప్ స్టర్ ముకుల్ శర్మ. ఈ ఫోన్ లో ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ తో రానున్నట్లు ఆయన లీక్ చేశాడు. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను అందిచారని తెలుస్తోంది.

ఇంకా..ఇందులో మూడు కెమెరాలే ఉన్నప్పటికీ.. నాలుగు కెమెరాలు చేసే పని ఈ ఫోన్ చేస్తుందంట. అయితే దీని గురించి అధికారిక వివరాలు తెలియరాలేదు. లీకైన వివరాల మేరకు.. ఇందులో వెనకవైపు దీర్ఘచతురస్రాకారపు కెమెరాలు ఉన్నాయి. మూడు కెమెరాలను నిలువుగా అమర్చారు. వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో సెల్ఫీ కెమెరా సామర్థ్యం 32 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే తో రానుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంటుందని తెలుస్తోంది. 4 , 6 జీబీ ర్యామ్, 64, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ పోన్ అందుబాటులోకి రానుందని సమాచారం.

క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుందంట. 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారని సమాచారం. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 108 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం2 సెన్సార్‌ను అందించడంతో పాటు.. 16 మెగాపిక్సెల్ ఓవీ16ఏ1క్యూ వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ ఓవీ02బీ1బీ సెన్సార్‌ ఉంటాయని తెలుస్తోంది.

Tags:    

Similar News