Moto G60, G40 Fusion: మోటో జీ60, జీ40 ఫ్యూజన్ రిలీజ్; సేల్ ఎప్పుడంటే..?
Moto G60, G40 Fusion: మోటో జీ60, మోటో జీ40 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్లు ఇండియాలో ఈరోజు లాంచ్ అయ్యాయి.
India
మోటో జీ60(Moto G60)
ఆండ్రాయిడ్ 11 పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేతో వచ్చిన ఈ ఫోన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. 128 జీబీ స్టోరేజ్ అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా 108 మెగాపిక్సెల్. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్ కూడా అందించారు. ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్. టర్బో 20 ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మోడల్ ధర రూ.17,999. డైనమిక్ గ్రే, ఫ్రాస్టెడ్ షాంపేన్ రంగుల్లో లభిస్తుంది. ఏప్రిల్ 27 న ఈ ఫోన్ సేల్ కు రానుంది.
మోటో జీ40 ఫ్యూజన్(Moto G40 Fusion)
ఆండ్రాయిడ్ 11పై పనిచేసే ఈ ఫోన్ 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లే కలిగి ఉంది. మోటో జీ40 ఫ్యూజన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్. హెచ్‌డీఆర్10 సపోర్ట్ చేస్తుంది.
కెమెరాల విషయానికి వస్తే.. వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్ అందించారు. ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, టర్బో 20 ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది.
4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ.13,999. అలాగే 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. డైనమిక్ గ్రే, ఫ్రాస్టెడ్ షాంపెయిన్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. మే 1 న ఈ ఫోన్ సేల్ జరుగుతుంది.