Smartwatch under 1500: రూ.1500లకే అదరిపోయే వాచ్‌లు.. మీ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి!
Smartwatch under 1500: 1500 రూపాయల కంటే తక్కువ ధర కలిగిన కొన్ని సరసమైన ఉత్తమ స్మార్ట్ వాచ్‌ల గురించి ఇక్కడ మాట్లాడుతాము. ఈ స్మార్ట్ వాచీలన్నీ దాదాపు 7 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తాయి.
Smartwatch under 1500: దీపావళికి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. కాబట్టి మీరు మీ బంధువులలో ఎవరికైనా బహుమతి ఇవ్వాలనుకుంటే, మీ బడ్జెట్ తక్కువగా ఉంటే మీరు స్మార్ట్ వాచ్ గురించి ఆలోచించవచ్చు. 1500 రూపాయల కంటే తక్కువ ధర కలిగిన కొన్ని సరసమైన ఉత్తమ స్మార్ట్ వాచ్‌ల గురించి ఇక్కడ మాట్లాడుతాము. ఈ స్మార్ట్ వాచీలన్నీ దాదాపు 7 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లు మీ ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేయడంతో పాటు మీ ఫోన్‌కి కనెక్ట్ చేయడం ద్వారా అనేక పనులలో సహాయపడతాయి. ఈ స్మార్ట్‌వాచ్‌ల ద్వారా మీరు మీ నోటిఫికేషన్‌లు, కాల్‌లు, మ్యూజిక్ కూడా కంట్రోల్ చేస్తాయి. ఇక్కడ నాయిస్, ఫాస్ట్రాక్, ఫైర్ బోల్ట్ వాచ్‌లు ఉన్నాయి.
నాయిస్ ఐకాన్ 2
నాయిస్ ఐకాన్ 2 ధర రూ. 1500 కంటే తక్కువ. ఇందులో మీరు పెద్ద 1.8 అంగుళాల డిస్‌ప్లేను పొందుతారు. దీనిలో బ్లూటూత్ కాలింగ్, AI వాయిస్ అసిస్టెంట్,గెస్చర్ కంట్రోల్, 7 రోజుల లాంగ్ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. ఈ డివైజ్‌తో మీరు మీ కాలింగ్‌ను సులభంగా కంట్రోల్ చేయచ్చు.
వాచ్‌లో 60 స్పోర్ట్స్ మోడ్‌లు, 100+ వాచ్ ఫేస్‌లు అందుబాటులో ఉన్నాయి. బ్లడ్ ఆక్సిజన్, 24 గంటలు హార్ట్ బీట్ మానిటర్, స్ట్రెస్ మానిటర్, స్లీప్ మానిటర్ వంటి హెల్త్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటీ కోసం మీరు బ్లూటూత్ v5.3 సౌకర్యాన్ని పొందుతారు. పరికరంలో మాగ్నెటిక్ ఛార్జర్ ఉంది. ఇది 2 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది.
ఫాస్ట్రాక్ రివోల్ట్ FS1
ఈ వాచ్ 240 x286 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్, 500 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో పెద్ద 1.83 అంగుళాల అల్ట్రా వ్యూ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2.5x నైట్రో ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేస్తుంది. దీని ధర కూడా రూ. 1500. ఇందులో కాల్ ఫంక్షన్, 110+ స్పోర్ట్స్ మోడ్‌లు, 200+ వాచ్ ఫేస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ పరికరం కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v5.2 ఫీచర్ కలిగి ఉంది. ఇది 7 రోజుల బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. స్ట్రెస్ మానిటర్, 24x7 HRM, SpO2, స్లీప్ ట్రాకర్, యాక్టివిటీ ట్రాకర్ అందుబాటులో ఉన్నాయి.
ఫైర్-బోల్ట్ రైజ్
ఈ వాచ్ ధర కూడా రూ. 1500. ఇందులో మీకు 1.85 అంగుళాల డిస్ప్లే లభిస్తుంది. డయల్ ప్యాడ్, కాంటాక్ట్ సింక్, కాల్ హిస్టరీ. 123 స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఈ వాచ్ SPO2, హార్ట్ రేట్ ట్రాకింగ్, స్పోర్ట్స్ డేటా అనాలిసిస్, స్లీప్ ట్రాకింగ్, స్టెప్ కౌంట్, క్యాలరీ కౌంట్, డిస్టెన్స్ మెజర్‌మెంట్ వంటి అనేక హెల్త్ మానిటరింగ్ ఫీచర్‌లను అందిస్తుంది.