Lava Agni 3 5G: లావా ఈజ్ బ్యాక్.. ఏకంగా ఐఫోన్ ఫీచర్స్‌తో కొత్త ఫోన్.. ఎలా ఉంటుందో..!

Lava Agni 3 5G: లావా అగ్ని 3 5జీని త్వరలో మార్కెట్‌లోకి లాంచ్ చేయనుంది. ఇందులో ఐఫోన్ యాక్షన్ బటన్ ఉంటుంది.

Update: 2024-09-28 07:19 GMT

Lava Agni 3 5G: లావా కొత్త ఫోన్ త్వరలో భారతదేశంలో లాంచ్ కానుంది. కంపెనీ Lava Agni 3 5G పేరుతో మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇది గత సంవత్సరం లావా అగ్ని 2 5Gకి సక్సెసర్‌గా లాంచ్ కానుంది. ఫోన్ లాంచ్ తేదీని బ్రాండ్ అధికారికంగా ప్రకటించింది. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం Agni 3 5G దేశంలో అక్టోబర్ 4 న ప్రారంభించనుంది. లావా గత కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో స్మార్ట్‌ఫోన్‌ను టీజ్ చేస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం లాంచ్‌కు ముందే వెల్లడయ్యే అవకాశం ఉంది.

లాంచ్‌కు ముందు లావా అగ్ని 3 లైవ్ ఫోటోను వెల్లడించారు. ఓ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ దీన్ని షేర్ చేశాడు. చిత్రంలో ఫోన్ వెనుక ప్యానెల్ కర్వ్ ఎడ్జ్‌తో చూడవచ్చు. ఫోన్ కెమెరా సెటప్ కూడా ఫోటోలో కనిపిస్తుంది. దీనిలో రెండు కెమెరాలు కనిపిస్తాయి.

ఐఫోన్‌ల యాక్షన్ బటన్‌లాగా ఫోన్‌లో కస్టమైజ్డ్ బటన్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. అంటే వినియోగదారులు తమ అవసరానికి అనుగుణంగా ఈ బటన్‌కు నిర్దిష్ట పనులను ఇవ్వగలుగుతారు. ఫోన్ వెనుక భాగంలో షియోమి 11 అల్ట్రాను గుర్తుకు తెచ్చే సెకండరీ డిస్‌ప్లే ఉండవచ్చు అని టిప్‌స్టర్ చెప్పారు.

ఈ క్రమంలో మరొక X యూజర్ డైమెన్సిటీ 7300X చిప్‌తో వస్తున్న మొదటి ఫోన్ ఇదే అని తెలిపారు అదనంగా ఫోన్ లావా అగ్ని 2 మాదిరిగానే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫోన్‌లో MediaTek Dimensity 7300X చిప్, 8GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. లావా సాఫ్ట్‌వేర్ అనుభవం స్టాక్ ఆండ్రాయిడ్‌కి దగ్గరగా ఉంది, అగ్ని 3 ఆండ్రాయిడ్ 14తో ప్రారంభించవచ్చు.

ఈ ఫోన్ ధర రూ. 25,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది భారతదేశంలో అత్యంత పోటీతత్వ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లలో ఒకటిగా నిలిచింది. ఇది OnePlus Nord CE 4, Vivo T3 Pro, నథింగ్ ఫోన్ (2A) వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

Tags:    

Similar News