Jio New Plans: రూ.10కే అన్‌లిమిటెడ్ కాలింగ్, 2జీబీ డేటా.. జియో బడ్జెట్ ప్లాన్ ఇదే.. ఇక పండగే పండగ..!
Jio New Plans: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. రోజుకు రూ.10లకే అన్‌లిమిటెడ్ కాలింగ్, 2జీబీ డేటా అందిస్తోంది.
Jio New Plans: రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ల కొత్త సిరీస్‌ను పరిచయం చేసింది. ఇవి తక్కువ ధరకు ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ఉత్తమ ప్లాన్‌లలో ఒకటి 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను కేవలం రోజుకు రూ.10కి అందిస్తుంది. ఈ ప్లాన్‌లు కంపెనీ బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌లటెల్, ఐడియా వొడాఫోన్‌ల నుంచి మారాలనుకొనే వారిని ఆకర్షించే వ్యూహంలో భాగంగా తీసుకొచ్చారు.
జూలై 3 నుండి Airtel, Vi వారి ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను 15 శాతం పెంచిన తర్వాత ఈ కొత్త ప్లాన్ వస్తుంది. ధరల పెరుగుదల కారణంగా చాలా మంది వినియోగదారులు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఈ కస్టమర్లను ఆకర్షించడానికి రిలయన్స్ జియో కొత్త 2GB డేటా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం.
కొత్త జియో ప్లాన్ ధర రూ. 999 రిఛార్జ్‌తో 98 రోజుల వాలిడితో వస్తుంది. అంటే రోజువారీ ఖర్చు రూ.10 మాత్రమే. రిలయన్స్ జియో ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఉచిత SMS వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఉచిత 5జీ ఇంటర్నెట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఇది కాకుండా వినియోగదారులు JioTV, JioCloud, JioCinema వంటి Jio యాప్‌లను కూడా ఉచితంగా ఉపయోగించుకోగలరు.
జియోకి పోటీగా ఎయిర్‌టెల్ కూడా కొత్త డేటా ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. వీటిలో రూ. 161, రూ. 181, రూ. 361 ధరల ప్లాన్‌లు ఉన్నాయి. ఇవి 30 రోజుల చెల్లుబాటుతో వస్తాయి. రూ.161 ఎయిర్‌టెల్ ప్లాన్ 30 రోజుల పాటు 12GB డేటాను అందిస్తుంది. దీని ఖరీదు ఒక్కో జీబీకి దాదాపు రూ.13. అదేవిధంగా రూ.181 ప్లాన్ 30 రోజులకు 15GB డేటాను అందిస్తుంది. దీని ధర GBకి దాదాపు రూ. 12 అదనం. రూ. 361 ప్లాన్ 30 రోజులకు 50GB డేటాతో వస్తుంది. ఇది GBకి దాదాపు రూ.7 అవుతుంది.