Jio Diwali Offer: జియో బంపర్ ఆఫర్.. ఏదాడి పాటు ఇంటర్నెట్ ఫ్రీ.. ఎలానో తెలుసా..?

Jio Diwali Offer: జియో దీపావళి ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఏడాది పాటు ఫ్రీ 5జీ ఇంటర్నెట్ ఆందిస్తోంది.

Update: 2024-09-22 09:22 GMT

jio diwali offer

Jio Diwali Offer: రిలయన్స్ జియో తన వినియోగదారులు కోసం దీపావళి ధమాకా ఆఫర్ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ద్వారా ఒక సంవత్సరం ఉచితంగా ఇంటర్నెల్ అందిస్తుంది. ఈ ఆఫర్ పండుగను మరింత ప్రత్యేకం చేస్తుంది. ఇది ప్రోమో ఆఫర్. దీని కింద జియో వినియోగదారులు 5జీ ఇంటర్నెట్‌ను ఫ్రీగా ఎటువంటి అంతరాయం లేకుండా ఎంజాయ్ చేయవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఈ పండుగ సీజన్‌లో ఒక సంవత్సరం ఉచిత రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఇందులో రోజుకు 2.5 GB డేటా ఉంటుంది. ఈ ప్లాన్ భారతదేశంలోని అన్ని టెలికాం సర్కిల్‌లలో అందుబాటులో ఉంది. దీనితో పాటు Jio దీపావళి ధమాకా ప్రమోషనల్ ఆఫర్ కింద కొత్త ఇప్పటికే ఉన్న కస్టమర్‌లు కూడా ఒక సంవత్సరం ఉచిత Jio AirFiberని పొందుతారు. ఈ ఆఫర్ 18 సెప్టెంబర్ నుండి 3 నవంబర్ 2024 వరకు అందుబాటులో ఉంటుంది.

రిలయన్స్ జియో దీపావళి ఆఫర్‌లో 1 సంవత్సరం ఉచిత Jio AirFiber కనెక్షన్‌ని పొందే అవకాశం ఉంది. ఈ ఆఫర్ కొత్త, ఇప్పటికే ఉన్న Jio Fiber, Jio AirFiber వినియోగదారులకు అందుబాటులో ఉంది. రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లలో షాపింగ్ చేయడం ద్వారా. ప్రత్యేక దీపావళి ప్లాన్‌ని ఎంచుకోవడం ద్వారా పొందవచ్చు.

Jio AirFiber లేదా Jio Fiber కనెక్షన్‌ని పొందాలనుకునే కొత్త కస్టమర్‌లు ఈ ఆఫర్‌ని పొందడానికి Reliance Digital లేదా MyJio స్టోర్‌లలో రూ. 20,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం మీకు ఎక్కువగా అనిపించినప్పటికీ, ఇప్పటికే AC, ఫ్రిజ్, టీవీ లేదా ఫోన్ వంటి వస్తువులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న కస్టమర్‌లకు ఈ ఆఫర్ ఉపయోగంగా ఉంటుంది.

ఇప్పటికే ఉన్న Jio AirFiber వినియోగదారులు 3 నెలల దీపావళి ఆఫర్ రూ. 2222తో రీఛార్జ్ చేయడం ద్వారా కూడా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. దీని వలన వారు 1 సంవత్సరం ఉచిత సర్వీస్‌కు అర్హులు అవుతారు. అదేవిధంగా ఇప్పటికే ఉన్న జియో ఫైబర్ వినియోగదారులు కూడా ఈ ప్రయోజనాలను వన్-టైమ్ అడ్వాన్స్ రీఛార్జ్ ద్వారా పొందవచ్చు.

రిలయన్స్ జియో అందించిన సమాచారం ప్రకారం అర్హత కలిగిన కస్టమర్‌లు నవంబర్ 2024, అక్టోబర్ 2025 మధ్య 12 కూపన్‌లను పొందుతారు. ఈ కూపన్లు యూజర్ యాక్టివ్ Jio AirFiber ప్లాన్ విలువకు సమానంగా ఉంటాయి. Reliance Digital, MyJio, JioPoint లేదా JioMart డిజిటల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో రీడీమ్ చేసుకోవచ్చు.

అయితే కూపన్‌లను పొందేందుకు వినియోగదారులు ప్రతి కూపన్‌ను స్వీకరించిన 30 రోజులలోపు ఎలక్ట్రానిక్స్‌పై రూ. 15,000 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్ గురించి మరింత సమాచారం కోసం మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Tags:    

Similar News