Dream Recording Device: అద్భుతం.. డ్రీమ్ మెషిన్ వచ్చేసింది.. కలలను రికార్డ్ చేసి కావలసినప్పుడు వాటిని మళ్లీ చూడొచ్చు..!

Dream Recording Device: జపాన్ శాస్త్రవేత్తలు కలలను రికార్డ్ చేయగల డివైజ్‌ను డెవలప్ చేసింది. ఇది బ్రెయిన్ ఇమేజింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేస్తోంది.

Update: 2024-09-27 13:34 GMT

Dream Recording Device

Dream Recording Device: టెక్నాలజీ రోజుకో కొత్త పుంతలు తొక్కుతుంది. సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్యర్యానికి గురి చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మీ కలలను రికార్డ్ చేసే పరికరం అందుబాటులోకి వచ్చింది. మీకు కావలసినప్పుడు వాటిని మళ్లీ చూడవచ్చు. అవును ఇది ఇప్పుడు సాధ్యమని సైన్స్, టెక్నాలజీ చెబుతున్నాయి. ఇప్పుడు ఏదీ అసాధ్యం అనిపించదు. జపాన్ శాస్త్రవేత్తలు మీ కలలను రికార్డ్ చేయగల, ప్లేబ్యాక్ చేయగల పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరం బ్రెయిన్ ఇమేజింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేస్తోంది.

జపాన్‌లోని క్యోటోలో ఉన్న ATR కంప్యూటేషనల్ న్యూరోసైన్స్ లాబొరేటరీస్ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. దీనిలో కలలను రికార్డ్ చేస్తుందని పేర్కొంది. ఈ ల్యాబ్ ప్రొఫెసర్ యుకియాసు కమిటాని అధ్యక్షతన నిర్వహించిన ఈ అధ్యయనంలో ఫంక్షనల్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (fMRI) సహాయంతో నాడీ కార్యకలాపాలు నమోదు చేయబడ్డాయి. ఇందులో పాల్గొన్న వాలంటీర్లు నిద్రిస్తున్నప్పుడు REM నిద్ర అనే స్థితికి చేరుకున్నారు. వారి కలల గురించి వారిని అడిగినప్పుడు పరికరం రికార్డ్ చేసిన సమాచారం 60 శాతం నిజమని తేలింది.

ప్రొఫెసర్ యుకియాసు కమితాని మాట్లాడుతూ.. నిద్రిస్తున్నప్పుడు మెదడు కార్యకలాపాలను ట్రాక్ చేయడంలో విజయం సాధించామని చెప్పారు. ఈ సాంకేతికతలో అనేక అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా మానవ మెదడు అంతర్గత సంచలనాలను గుర్తించవచ్చు. ఈ పరికరం మానవ మెదడు కార్యకలాపాలను అర్థం చేసుకోవడంలో ముఖ్యమైన సహకారం అందించగలదు. నివేదిక ప్రకారం ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ మార్క్ స్టోక్స్ మాట్లాడుతూ ఇది ఒక అనూహ్యమైన పరిశోధనా అనుభవం అని, ఇందులో మనం కలలు కనే రీడింగ్ మెషీన్‌కు దగ్గరగా ఉండగలిగాము.

మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తుల పరిశోధనలో ఈ సాంకేతికత ముఖ్యమైన సహకారం అందించగలదు. ఈ సాంకేతికతను మరింత మెరుగుపరచడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తూనే ఉంటారు. మెదడు కార్యకలాపాలను చదవడంలో మనం చాలా వరకు విజయం సాధించిన ప్రారంభ దశ ఇది. ఈ సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున మనం కలలను మరింత లోతుగా అధ్యయనం చేయగలుగుతాము.

Tags:    

Similar News