WhatsApp Down: వాట్సాప్‌ సేవల అంతరాయంపై కేంద్రం ఆరా.. నివేదిక ఇవ్వాలని..

WhatsApp Down: 90 అంటే 90 నిమిషాలు అక్షరాల గంటన్నర పాటు అన్నీ బంద్ ఒక్కసారిగా ప్రపంచమే ఆగిపోయినంత పనైంది.

Update: 2022-10-25 10:45 GMT

WhatsApp Down: వాట్సాప్‌ సేవల అంతరాయంపై కేంద్రం ఆరా.. నివేదిక ఇవ్వాలని..

WhatsApp Down: 90 అంటే 90 నిమిషాలు అక్షరాల గంటన్నర పాటు అన్నీ బంద్ ఒక్కసారిగా ప్రపంచమే ఆగిపోయినంత పనైంది. వేల కోట్ల షేర్స్ ఉన్నఫలంగా ఢమాల్ అన్నాయి. ముఖ్య వ్యవహారాలు, కీలక లావాదేవీలు, ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఇలా ఒకటేమిటి అన్నీ బంద్ అయ్యయి. ప్రపంచ వ్యాప్తంగా గంటన్నరపాటు వాట్సాప్ పనిచేయలేదు. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లోని యూజర్లందరికీ ఊపిరాడనంత పనైంది. దీంతో సోషల్ మీడియాలో ఇదేందయ్యా సామీ వాట్సాప్ ఆగిపోయిందంటూ వేల కొద్ది కంప్లయింట్లు వచ్చిపడ్డాయి.

ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్‎లో సేవలు నిలిచిపోవడంపై కేంద్ర ఐటీ శాఖ స్పందించింది. హ్యాక్సర్స్ పనే అనే వార్తల నేపథ్యంలో కేంద్రం సీరియస్ అయ్యింది. ఆ 90 నిమిషాల పాటు వాట్సప్ సేవలు ఎందుకు ఆగిపోయాయో అన్న విషయాలపై వివరణ కోరింది. సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లే ఈసమస్య తలెత్తిందా..? అన్న కోణంలో ఐటీ నిపుణులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News