iQOO Neo 10 Series: ఐక్యూ నుంచి సూపర్ ఫోన్లు.. ప్రాసెసర్ అద్భుతంగా ఉంది..!

iQOO Neo 10 Series: ఐక్యూ త్వరలో నియో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది.

Update: 2024-08-20 13:26 GMT

iQOO Neo 10 Series

iQOO Neo 10 Series: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు టెక్ మార్కెట్‌లో వేగంగా దూసుకుపోతున్నాయి. పోటాపోటీగా సరికొత్త ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. అన్ని సెగ్మెంట్‌లలో తన మార్క్‌ను చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే iQOO గతేడాది iQOO 12 సిరీస్, iQOO నియో 9 సిరీస్‌ ఫోన్లను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ నియో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై బ్రాండ్ పనిచేస్తోందని వెల్లడించింది. అంతేకాకుండా నియో 10 లైనప్‌ డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఓ టిప్‌స్టర్ దీని గురించి కొంత సమాచారాన్ని కూడా లీక్ చేశారు. నియో 10 సిరీస్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

iQOO నియో సిరీస్ సబ్-ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3, డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌‌పై వస్తుందని టిప్‌స్టర్ తెలిపారు. అలాను కొత్తగా నియో సిరీస్ తర్వాత వస్తున్న స్మార్ట్‌ఫోన్‌లలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం iQOO Neo 10 సిరీస్ తర్వాత iQOO 13 విడుదల చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ నియో 10 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3పై ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. ప్రో వేరియంట్‌లో డైమెన్సిటీ 9400 ఉండవచ్చు అని టిప్‌స్టర్ స్పష్టంగా పేర్కొనలేదు.

Weibo పోస్ట్‌ ప్రకారం iQOO నియో 10 మోడల్‌లు ప్లాస్టిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటాయి. ఇవి నియో 9 సిరీస్‌లా కాకుండా మెటల్ మిడిల్ ఫ్రేమ్‌‌తో రావచ్చు. Neo 10 మోడల్‌లో ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తాయి. వీటిలో సిలికాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100W కంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. పవర్ కోసం 6,000mAh+ బ్యాటరీతో రావచ్చు. వీటితో పాటుగా స్మార్ట్‌ఫోన్‌లో 1.5K రిజల్యూషన్ ఫ్లాట్ డిస్‌ప్లే అల్ట్రా-నారో బెజెల్స్‌తో ఉంటుంది

కంపెనీ గతేడాది iQOO నియో 9 సిరీస్‌లో నియో 9, నియో 9 ప్రో అనే రెండు మోడల్‌లను విడుదల చేసింది. నియో 9 స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2, నియో 9 ప్రోలో డైమెన్షన్ 9300 ప్రాసెసర్ ఉంటాయి. నియో 9 ప్రో చైనాలో మాత్రమే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే నియో 9 దేశంలో iQOO నియో 9గా రీబ్రాండ్ చేయబడింది. ప్రస్తుతం నియో 10 సిరీస్ గ్లోబల్ మార్కెట్ లాంచ్ గురించి ఎటువంటి వివరాలు తెలియలేదు.

Tags:    

Similar News